Cruise Drugs Case: షారుఖ్ తనయుడికి హృతిక్ రోషన్ బాసట.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంగ‌నా ర‌నౌత్

|

Oct 08, 2021 | 11:43 AM

కంగనా రనౌత్ తన సోషల్ మీడియాలో హృతిక్ పోస్ట్ కి స్పందిస్తూ.. ఇపుడు మాఫియా ప‌ప్పులంద‌రూ ఆర్య‌న్ ఖాన్ కు ర‌క్షణ‌గా వ‌స్తున్నారు. మేము త‌ప్పులు చేస్తాం కానీ వాటిని కీర్తించ‌కూడదు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పడు పుకార్లు..

Cruise Drugs Case: షారుఖ్ తనయుడికి హృతిక్ రోషన్ బాసట.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంగ‌నా ర‌నౌత్
Kangana Ranaut
Follow us on

ఆర్యన్‌ ఖాన్‌కు జైలా..? బెయిలా..? ఏం జరగబోతోంది..? నిన్నటితో ఆర్యన్‌ సహా 8మందికి ఎన్సీబీ కస్టడీ ముగియడంతో..14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది కోర్ట్‌. దీంతో తనకు బెయిల్‌ కోసం సుప్రీంను ఆశ్రయించాడు మరోవైపు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆర్యన్‌ ఖాన్‌. తాజాగా ఆర్యన్ కి సపోర్ట్ గా నిలుస్తూ బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పోస్ట్ పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ సీరియస్ అయింది. హృతిక్ రోష‌న్ పెట్టిన పోస్టుకు ఘాటుగా సమాధానం ఇస్తూ పోస్ట్ పెట్టింది. కంగనా రనౌత్ తన సోషల్ మీడియాలో హృతిక్ పోస్ట్ కి స్పందిస్తూ.. ఇపుడు మాఫియా ప‌ప్పులంద‌రూ ఆర్య‌న్ ఖాన్ కు ర‌క్షణ‌గా వ‌స్తున్నారు. మేము త‌ప్పులు చేస్తాం కానీ వాటిని కీర్తించ‌కూడదు.

ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పడు పుకార్లు చేయ‌క‌పోవ‌డం మంచిది..కానీ ఏ త‌ప్పు చేయ‌లేద‌ని వారికి అనిపించ‌డం నేర‌మ‌ని, తప్పు చేసిన వారికి సపోర్ట్ చేయడం కూడా తప్పని ప‌రోక్షంగా హృతిక్ రోష‌న్ పోస్టుపై కౌంట‌ర్ ఎటాక్ చేసింది కంగ‌నా.

కంగనా చేసిన ఇన్ట్సా పోస్ట్..

Kangana Ranaut Comments

మరోవైపు ఈ డ్రగ్స్‌ కేసు, ఆర్యన్‌ అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్సీపీ లీడర్‌ నవాబ్‌ మాలిక్‌. ఈ కేసులో రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ముందు 10మందిని అరెస్ఠ్‌ చేసినట్టు చెప్పిన ఎన్సీబీ..ఆ తర్వాత 8మందిని మాత్రమే కోర్టులో ప్రవేశపెట్టారని.. మిగిలిన ఇద్దరినీ ఈ కేసు నుంచి తప్పించారని సీరియస్ అయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరు బీజేపీ లీడర్‌ బంధువులని.. అందుకు సంబంధించి ఆధారాలతో సహా ఇవాళ వెల్లడిస్తానని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

IPL 2021 RCB vs DC Live Streaming: బెంగళూరు వర్సెస్ ముంబై.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసా..

Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..

Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..