Alia Bhatt Business: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఓ వైపుగా నటిగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపారవేత్తగా మారనున్నారు. తాజాగా అగరబత్తీలు, బయోలెదరు తయారు చేసే సంస్థ “అంకుర”లో ఆలియా భట్ పెట్టుబడులు పెట్టి.. వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. ఇప్పటికే హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే..
తాను అంకుర లో పెట్టుబడులు పెట్టడం విషయంపై మాట్లాడుతూ.. ఇలా వ్యాపార రంగంలో అడుగు పెట్టడం చాలా పెట్టుబడి పెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ సంస్థలో పూలను రీసైక్లింగ్ చేసి అగరబత్తీ, బయో లెదర్ను తయారుచేస్తారని.. ఈ ఐడియా తనకు చాలా నచ్చిందని తెలిపింది. ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వస్తువుల ద్వారా వాతావరణ కాలుష్యం నివారింపబడుతుందని తెలిపింది. అంకురలో ఉత్పత్తి చేస్తున్న ఎకో ఫ్రండ్లీ వస్తువుల వలన నదులు శుభ్రంగా ఉంటాయి. తాను పెట్టుబడి పెట్టడానికి మరో ముఖ్య కారణం ఈ కంపెనీ ద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి కలుగుతుందని చెప్పింది.
ఇంజినీరింగ్ పట్టభద్రుడైన అంకిత్ అగర్వాల్.. 2017లో అంకుర సంస్థను స్థాపించాడు. ఈ స్టార్టప్ కంపెనీ సీడ్ ఫండింగ్ ద్వారా దాదాపు 2 మిలియన్ల డాలర్లను ఐఐటీ కాన్పూర్, ఐఏఎన్ ఫండ్, సోషల్ అల్ఫా ఎప్ఐఎస్ఈ, డ్రాపర్ రిచర్డ్స్ కల్పన్ ఫౌండేషన్ నుంచి సేకరించింది.
బాలనటిగా బాలీవుడ్ లో అడుగు పెట్టిన అలియా భట్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా టాలీవుడ్ లో జక్కన్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది.
Also Read: ‘గోర్ మాటి’ పాటని ఆవిష్కరించిన చంద్రబోస్.. దేశంలో ఉన్న ప్రతి ఒక్క బంజారా సినిమా చూడాలని పిలుపు..