Ala Vaikunthapurramuloo: రూమర్లు.. హింట్లు….ఫైనల్‌గా ప్లసెంట్ బీజీతో టైటిల్ రివీలింగ్‌లు. కాని అసలు మ్యాటర్ అదేనా.. అది అల వైకుంఠపురానికి రిమేకేనా..? ఎవరికీ తెలియదు.. ఎక్కడా లేదు.? ఇది తాజాగా కార్తీక్ ఆర్యన్ “సత్యనారాయణ్ కీ కథ” టైటిల్ టీజర్ పై సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన చిత్రం “అలవైకుంఠపురంలో”. ఈ సినిమాను హిందీలో రిమేక్ చేస్తున్నట్లుగా కొన్ని రోజులుగా బీటౌన్‌లో ఓ న్యూస్. ఆ న్యూస్ నిజమన్నట్టే.. రీసెంట్‌గా హీరో కార్తీక్ ఆర్యన్ బుట్ట బొమ్మ పాటకు డ్యాన్స్. దీంతో ఈ సినిమా హిందీ రిమేక్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే టాక్ సోషల్ మీడియాను ముంచెత్తింతి. అల్లురు అర్జున్ క్యారెక్టర్‌లో కార్తిక్ ఆర్యన్, పూజా హెగ్డే క్యారెక్టర్‌లో కృతి సనన్ ఫిక్స్ అయినట్లు మరో న్యూస్ కూడా చెక్కర్లు కొట్టింది.
ఇక తాజాగా “సత్యనారాయణ్ కీ కథ” టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న టీజర్ బీజీ ఆల్మోస్ట్ అలవైకుంఠపురంలో.. ఫీల్‌ను తీసుకువస్తూ… చాలా ప్లసెంట్ గా ఉంది. దీంతో ఈ సినిమానే అలవైకుంఠ రిమేక్ అనే టాక్ అటు బీ టౌన్‌లోనూ ఇటు టీటౌన్‌లోనూ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు టైటిల్ కూడా అల ఫీల్‌ను కలిగిస్తుండడంతో ఈ సినిమా ఖచ్చింతగా “అల” రిమేక్ అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు కూడా కనిపిస్తున్నాయి. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న ఈ చిత్రానికి.. జాతీయ పురస్కార గ్రహీత, మరాఠా దర్శకుడు సమీర్ విద్వాన్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ టీజర్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కార్తిక్ … A story close to my heart..A special film with special people అంటూ రాసుకొచ్చారు.
A story close to my heart#SatyanarayanKiKatha ❤️
A special film with special people ??#SajidNadiadwala sir @sameervidwans @shareenmantri @WardaNadiadwala @kishor_arora #KaranShrikantSharma @NGEMovies @namahpictures
#SNKK pic.twitter.com/ajOX9pfJU6— Kartik Aaryan (@TheAaryanKartik) June 23, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :