‘ఫ్యాన్’ చిత్రంలో షారూఖ్ ఖాన్ తో కలిసి స్క్రీన్ ను పంచుకున్న బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా పక్షవాతానికి గురైంది. ఆమె కుటుంబ సభ్యులు ముంబై ఆస్పత్రిలో చేర్పించారు. స్వతాగా నర్సింగ్ డిగ్రీ చేసిన శిఖా.. కరోనా లాక్‌డౌన్ నుంచి ఆరు నెలల పాటు కొవిడ్ రోగులకు స్వచ్ఛందంగా నర్సింగ్ సేవలు చేశారు. దీంతో అక్టోబరు నెలలో శిఖా మల్హోత్రా కరోనా బారిన పడి చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. మళ్లీ ఇంతలోనే ఇలా జరిగింది.
శిఖాకు పక్షవాతం రావడంతో ఆమె కుడివైపు కాళ్లు, చేతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం ఆమె జుహూలోని కూపర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమె మాట్లాడలేక పోతుందనిర, కుడివైపు శరీరం తీవ్రంగా ప్రభావితమైందని ఆమె మేనేజరు అశ్వని శుక్లా తెలిపారు. కరోనాకు గురైనపుడు తన ఆరోగ్యం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన శిఖా.. కోలుకున్నాక కూడా నెటిజన్లకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆమెకు ఇలా కావడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. పలువురు బాలీవుడ్ నటులు ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శిస్తున్నారు.