Viral Video: కచ్చా బాదాం పాటకు మాధురీ దీక్షిత్.. రితేష్ దేశ్‏ముఖ్ అదిరిపోయే డ్యాన్స్.. వీడియో వైరల్..

కచ్చా బాదం సాంగ్.. సోషల్ మీడియాలో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో పనిలేకుండా ప్రపంచవ్యాప్తంగా

Viral Video: కచ్చా బాదాం పాటకు మాధురీ దీక్షిత్.. రితేష్ దేశ్‏ముఖ్ అదిరిపోయే డ్యాన్స్.. వీడియో వైరల్..
Maduri
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2022 | 8:44 AM

కచ్చా బాదం సాంగ్.. సోషల్ మీడియాలో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో పనిలేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈపాటకు స్టెప్పులేశారు. ఇన్‏స్టా రీల్స్‏లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బెంగాలీ కచ్చా బాదం పాట నెట్టింట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ పాటకు తమ స్టైల్లో స్టెప్పులేస్తూ అదుర్స్ అనిపించారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సాంగ్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. కచ్చా బాదాం పాట క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ పాటకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధూరీ దీక్షిత్ (Maduri Dixit).. హీరో రితేష్ దేశ్‏ముఖ్ (Riteish Deshmukh) అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కచ్చా బాదం పాటకు హీరో రితేష్ దేశ్‏ముఖ్, హీరోయిన్ మాధురీ దీక్షిత్ కలిసి ఎంతో అందంగా స్టెప్పులేశారు. ఈ వీడియోను మాధురీ దీక్షిత్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ ” ఇది చాలా సరదాగా ఉంది, కదా ? ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పాటను పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన పచ్చివేరుశనగల వ్యాపారీ భువన్‌ బద్యాకర్‌ పాడారు. తన వేరుశెనగలను విక్రయించడానికి పాటలు పాడుతూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటారు. భువన్ పాడుతున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయ్యింది.

Also Read: Viral Photo: ఈ ఇద్దరు చిన్నారులు అమ్మాయిల ఫేవరేట్ హీరోస్.. ఈ బ్రదర్స్ ఇద్దరి క్రేజ్ వేరేలెవల్..

Anjali: క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్, శంకర్ సినిమాలో అంజలి ?.. ఏ పాత్రలో అంటే..

Samantha: విడాకుల తర్వాత తొలిసారి నాగచైతన్య ఫోటో షేర్ చేసిన సమంత.. ఎందుకంటే..

Viral Video: వధూవరులకు స్టేజ్ పైనే షాకిచ్చిన స్నేహితులు.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు.. వీడియో వైరల్..