Spirit Movie: ప్రభాస్ సరసన కరీనా కపూర్ ?.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్..

|

Sep 07, 2022 | 8:19 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న స్పిరిట్ (Spirit) చిత్రంలో కరీనా నటించనున్నట్లు టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై స్పందించింది కరీనా.

Spirit Movie: ప్రభాస్ సరసన కరీనా కపూర్ ?.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్..
Kareena
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో కరీనా కపూర్ ఒకరు. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న కరీనాకు.. ఇటు దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న కరీనా.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇందులో కరీనా నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కరీనా కపూర్ నటించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న స్పిరిట్ (Spirit) చిత్రంలో కరీనా నటించనున్నట్లు టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై స్పందించింది కరీనా.

ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్ చిత్రానికి మీకు ఆఫర్ వచ్చిందా అని అడగ్గా.. లేదని చెప్పింది. తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని.. తాను స్పిరిట్ సినిమాలో నటించనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. హై ఆక్టేన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీసుగా కనిపించనున్నారని టాక్. తర్వలోనే ఈ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరీనా సుజోయ్ ఘోష్ చిత్రంలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.