భారీ బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రాలు విడుదలై థియేటర్లకు పూర్వ వైభవం వచ్చింది. అయినప్పటికీ ఓటీటీలకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న స్టార్స్ మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సమంత, రెజీనా, నివేదా పేతురాజ్ వంటి హీరోయిన్స్ వెబ్ సిరీస్లలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol) సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. ఆమెకు సంబంధించిన స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ కు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. టైటిల్, విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. “కొత్త ఫార్మాట్లను అన్వేషించడం ఎల్లప్పుడూ ఒక సవాలు. వాటిని ఎదుర్కోవడం గొప్ప విషయం. డిజిటల్ సిరీస్ లకు వీరాభిమానిని కావడం వలన ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది” తెలిపారు. కాజోల్ వంటి ప్రముఖ నటీతో వెబ్ సిరీస్ చేయడం చాలా సంతోషంగా ఉందని.. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు మేకర్స్.
Kuch kuch ho raha hai, tum nahi samjhoge.
Can you guess what we’re up to? ? @itsKajolD pic.twitter.com/3pzmgn6PGy— Disney+ Hotstar (@DisneyPlusHS) July 18, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.