Kiara Advani-Sidharth Malhotra: పెళ్లి పీటలెక్కబోతున్న మరో ప్రేమజంట.. అసలు విషయం లీక్ చేసిన స్టార్ హీరో..

ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సిద్ధార్థ్.. కియారా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చేశాడు. అదే సమయంలో తనతో పెళ్లి జరిగితే తన ఫ్యూచర్ మరింత బాగుంటుందంటూ హింట్ కూడా ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

Kiara Advani-Sidharth Malhotra: పెళ్లి పీటలెక్కబోతున్న మరో ప్రేమజంట.. అసలు విషయం లీక్ చేసిన స్టార్ హీరో..
Siddarth Kiara

Updated on: Aug 22, 2022 | 1:40 PM

బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. షేర్సా మూవీ సమయం నుంచి వీరిద్దరు సన్నిహితంగా ఉంటున్నారని.. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. అయితే తమపై వస్తున్న రూమర్స్ పట్లు ఈ ప్రేమపక్షులు ఇప్పటివరకు స్పందించలేదు. ఇక ఇటీవల కొద్దిరోజులుగా వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరు తమ పెళ్ళి విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సిద్ధార్థ్.. కియారా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చేశాడు. అదే సమయంలో తనతో పెళ్లి జరిగితే తన ఫ్యూచర్ మరింత బాగుంటుందంటూ హింట్ కూడా ఇచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి వివాహం గురించిన అసలు విషయాన్ని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ లీక్ చేశారు.

హీరోయిన్ కియారాతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న షాహిద్ కపూర్… సిద్ధార్థ్, కియారా అద్వానీ మధ్య బంధం గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమో.. సిద్, కియారా గురించి కరణ్ ప్రశ్నిస్తుండగా.. షాహిద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరలో అంటే డిసెంబర్ నెలలో అతి పెద్ద ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని.. అది సినిమా గురించి మాత్రం కాదంటూ చెప్పుకొచ్చాడు. దీంతో డిసెంబర్ నెలలో సిద్, కియారా పెళ్లికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే తనకు సిద్దార్థ్ స్నేహితుల కంటే ఎక్కువ.. అతనెప్పుడూ తనకు ప్రత్యేకమే అని కియారా చెప్పుకొచ్చింది. దీంతో సిద్, కియారా నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ బీటౌన్‎లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.