Prabhas: పాన్ ఇండియా స్టార్ క్రేజ్ అస్సలు తగ్గట్లేదుగా.. ప్రభాస్ తన ఫేవరేట్ అంటున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..

|

Jul 18, 2022 | 11:35 AM

తాజాగా తన ఫేవరేట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే తెల్చీ చెప్పేసాడు హీరో రణబీర్ కపూర్. వీరిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. బాహుబలి 2 అనంతరం కలిసి పార్టీ కూడా

Prabhas: పాన్ ఇండియా స్టార్ క్రేజ్ అస్సలు తగ్గట్లేదుగా.. ప్రభాస్ తన ఫేవరేట్ అంటున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
Prabhas
Follow us on

జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా రేంజ్‏ను హాలీవుడ్ స్థాయికి పరిచయం చేశారు జక్కన్న. ఇక ఈ మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు. బాహుబలి సినిమాతో డార్లింగ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయనతో సినిమాలు చేసేందుకు ఇతర భాషల డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రెటీస్ సైతం ప్రభాస్‏కు ఫ్యా్న్స్ అయిపోయారు. తాజాగా తన ఫేవరేట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే తెల్చీ చెప్పేసాడు హీరో రణబీర్ కపూర్. వీరిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. బాహుబలి 2 అనంతరం కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు రణబీర్,

ప్రస్తుతం రణబీర్ షంషేరా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, సంజయ్ దత్, వాణికపూర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల తెలుగు మీడియాతో ఇంట్రాక్ట్ అయిన రణబీర్ తన ఫేవరెట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు.

Prabhas 1

కేవలం నటనపరంగానే కాకుండా.. వ్యక్తిత్వంలోనూ డార్లింగ్ తనకు చాలా ఇష్టమని, బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ ను చూడడం తనకు చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రణబీర్ చేతిలో యానిమల్, బ్రహ్మస్త్ర చిత్రాలు ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.