AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajol: డిజిటల్ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్.. తన ఫస్ట్ వెబ్ సిరీస్ ప్రకటించిన కాజోల్..

కొత్త ఫార్మాట్లను అన్వేషించడం ఎల్లప్పుడూ ఒక సవాలు. వాటిని ఎదుర్కోవడం గొప్ప విషయం. డిజిటల్ సిరీస్ లకు వీరాభిమానిని కావడం వలన ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి.

Kajol: డిజిటల్ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్.. తన ఫస్ట్ వెబ్ సిరీస్ ప్రకటించిన కాజోల్..
Kajol
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2022 | 5:06 PM

Share

భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా చిత్రాలు విడుదలై థియేటర్లకు పూర్వ వైభవం వచ్చింది. అయినప్పటికీ ఓటీటీలకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న స్టార్స్ మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సమంత, రెజీనా, నివేదా పేతురాజ్ వంటి హీరోయిన్స్ వెబ్ సిరీస్‏లలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol) సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. ఆమెకు సంబంధించిన స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ కు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. టైటిల్, విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. “కొత్త ఫార్మాట్లను అన్వేషించడం ఎల్లప్పుడూ ఒక సవాలు. వాటిని ఎదుర్కోవడం గొప్ప విషయం. డిజిటల్ సిరీస్ లకు వీరాభిమానిని కావడం వలన ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది” తెలిపారు. కాజోల్ వంటి ప్రముఖ నటీతో వెబ్ సిరీస్ చేయడం చాలా సంతోషంగా ఉందని.. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ..
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ..
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..