అమీర్ దంపతుల విడాకులపై బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. ఆమె బోర్ కొట్టిందంటూ..

| Edited By: Rajitha Chanti

Jul 10, 2021 | 9:59 AM

బాలీవుడ్ మిస్టర్ ఫర్‏ఫెక్ట్ అమీర్ దంపతుల విడాకుల వ్యవహారం ఇప్పుడు బీటౌన్‏లో హాట్‏టాపిక్‏గా మారింది. తాము సంతోషంగా విడిపోతున్నామని అమీర్ ఖాన్, కిరణ్ రావు

అమీర్ దంపతుల విడాకులపై బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. ఆమె బోర్ కొట్టిందంటూ..
Aamir Khan
Follow us on

బాలీవుడ్ మిస్టర్ ఫర్‏ఫెక్ట్ అమీర్ దంపతుల విడాకుల వ్యవహారం ఇప్పుడు బీటౌన్‏లో హాట్‏టాపిక్‏గా మారింది. తాము సంతోషంగా విడిపోతున్నామని అమీర్ ఖాన్, కిరణ్ రావు అధికారికంగా ప్రకటించి రోజులు గడుస్తున్న ఇంకా టాక్ ఆఫ్ ది టౌన్‏గా నిలుస్తుంది. కొందరు అమీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అమీర్ ఖాన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. ప్రతి 15 సంవత్సరాలకు అమీర్ ఖాన్‏కు భార్య అంటే ఇష్టం లేకుండా పోతుందా.. ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుని 15 ఏళ్లకు విడాకులు ఇస్తారా ? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకుల పై బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ స్పందించాడు.

బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ మాట్లాడుతూ.. “అమీర్ మొదటి భార్య రీనా దత్తాకు, రెండవ భార్య కిరణ్ రావుకు కూడా 15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎప్పుడూ ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచించలేదు. ఆసలు డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అందుకే ఈసారి ఆయన రెండవ విడాకులకు గాను కిరణ్ రావుకు భారీ మొత్తంలో భరణం ఇవ్వాల్సి రావచ్చు. అది ఆయనకు ఆమోద యోగ్యంగా ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. నీతి నిజాయితీకి పేరు అన్నట్లుగా మాట్లాడే అమీర్ ఖాన్ తన విడాకుల విషయంలో కూడా నీతిగా ప్రకటన చేసి ఉంటే బాగుండేది.. ఆయన ఇతర కారణం చెప్పకుండా నేరుగా నాకు కళ్లజోడు అమ్మాయి మొహం చూసి బోర్ కొట్టింది.. ఈమెను కాకుండా కొత్త వారిని జీవితంలో కోరుకుంటున్నాను అంటూ చెప్పి విడాకుల ప్రకటన చెయాల్సింది. కిరణ్ రావు లాంటి సామాన్యమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న సమయంలో చాలా మంది ఎలా అమీర్ ఈమెను వివాహాం చేసుకున్నాడు.

కళ్ళజోడు లేకుండా చూడలేని ఈమెను ఎలా మెచ్చాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఆమె నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకుంటున్నాడేమో ” అంటూ కమల్ ఆర్ ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమీర్ కత్రీనా కైఫ్, ఫాతిమ సనా షేక్ వంటి అందెగత్తలను చూసుకోవాలి. కానీ అప్పట్లో ఎలా కిరణ్ రావును చేసుకున్నాడో అర్థం కాలేదు అన్నట్లుగా ఆయన తన వీడియోలో కామెంట్స్ చేశాడు. ఇక అమీర్ విడాకుల ప్రస్తావన తర్వాత దంగల్ బ్యూటీ సనా షేక్, అమీర్ ఖాన్ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కమల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారింది.

వీడియో..

Also Read: Rajaji Tiger Reserve : రాజాజీ టైగర్ రిజర్వ్‌కు చెందిన పులి కనిపించడం లేదు.. ప్రస్తుతం దాని వయసు 21 సంవత్సరాలు..

Capsicum benefits: క్యాప్సికమ్‏ పక్కకు పడేస్తున్నారా ? దాని ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

Zika virus Cases: కేరళలో జికా వైరస్‌ కలకలం.. తిరువనంతపురంలో 15 కేసులు గుర్తింపు.. బాధితుల ట్రావెల్‌ హిస్టరీపై ఆరా