Arjun Kapoor: మలైకా సంపాదనపై అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఇలాంటివి చూడడం సిగ్గుచేటు అంటూ..

బాలీవుడ్‏లోని లవ్ బర్డ్స్‏లలో మలైకా, అర్జున్ కపూర్ ఒకరు. ఎన్నో సంవత్సరాలు ‏ప్రేమలో ఉన్న ఈ జంట ఇటివలే అధికారికంగా

Arjun Kapoor: మలైకా సంపాదనపై అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఇలాంటివి చూడడం సిగ్గుచేటు అంటూ..
Arjun

Updated on: Aug 09, 2021 | 4:45 PM

బాలీవుడ్‏లోని లవ్ బర్డ్స్‏లలో మలైకా, అర్జున్ కపూర్ ఒకరు. ఎన్నో సంవత్సరాలు ‏ప్రేమలో ఉన్న ఈ జంట ఇటివలే అధికారికంగా ప్రకటించిన తర్వాత కలిసి బయట చక్కర్లు కొడుతూ మీడియాకు చిక్కారు. అయితే తాజాగా అర్జున్ కపూర్ తన సంపాదనను మలైకాతో పోల్చాడాన్ని ఖండిచారు. తన సంపాదనను మలైకా అరోరా సంపాదనతో పోలుస్తూ వార్తలు రాయడం బాధకరమని.. ఇలాంటివి చదవడం నిజంగా సిగ్గుచేటు అంటూ తన ఇన్‏స్టాలో షేర్ చేశారు. ఆ తర్వాత కొద్ది సమయానికి ఆ పోస్ట్‏ను తొలగించారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Arjun Kapoor

2021లో ఇలాంటి డాఫ్ హెడ్‏లైన్ చదవడం బాధకరం, సిగ్గుచేటు. ఆమె బాగా సంపాదిస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఆమె పనిచేస్తుపంది. నన్ను ఎవరితోనూ పోల్చకండి.. ఒంటరిగా వదిలేయండి అంటూ అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ తర్వాత వెంటనే తన పోస్ట్ తొలగించాడు.

అర్జున్ కపూర్, మలైకా అరోరా చాలా సంవత్సరాలుగా రిలేషన్‏షిప్‏లో ఉన్నారు. 2019లో ఈ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి వీరిద్ధరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా బాలీవుడ్‏లో టాక్ నడుస్తోంది. అర్జున్ కపూర్ కంటే మలైకా.. దాదాపు 12 సంవత్సరాలు పెద్దది. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‏తో విడాకులు తీసుకుంది. వీరికి ఆర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అర్భాజ్‏తో విడాకులు తీసుకున్న తర్వాత మలైకా.. అర్జున్ కపూర్‏తో ప్రేమాయణం కొనసాగిస్తుంది.

Also Read: Juhi Chawla: ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. మీరే తేల్చాలంటూ పిలుపు..

Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..