Akshay Kumar: బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.. పాఠశాలకు కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..

|

Jun 17, 2021 | 5:44 PM

దేశం కోసం నిరంతరం పోరాడే జవాన్లు రియల్ హీరోలని.. వారిని కలుసుకోవడం ఒక మధురమైన అనుభవం అన్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.

Akshay Kumar: బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.. పాఠశాలకు కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..
Akshay Kumar
Follow us on

దేశం కోసం నిరంతరం పోరాడే జవాన్లు రియల్ హీరోలని.. వారిని కలుసుకోవడం ఒక మధురమైన అనుభవం అన్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. గురువారం (జూన్ 17న) ఆయన జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జావాన్లను కలిశారు. ఈ సందర్భంగా దేశంలో కోసం ప్రాణాలను ఆర్పించిన జవాన్ల స్మారక స్థూపంపై పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించారు. అనంతరం వారితో కలిసి జమ్మూ కాశ్మీర్‏లోని లోక్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం వారితో కలిసి వాలీబాల్ ఆడారు. జవాన్లతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‏స్టాగ్రామ్‏షేర్ చేశారు..

“ఈరోజు దేశ సరిహద్దులలో మనల్ని రక్షిస్తున్న @bsf_india జవాన్లతో ఒక మర్చిపోలేని రోజును గడిపాను. ఇక్కడకి రావడం.. నిజమైన హీరోలను కలుసుకోవడం గౌరవప్రదమైన అనుభవం.. ఇప్పుడు నేను గర్వంగా ఫీలవుతున్నాను ” అని అక్షయ్ వ్యాఖ్యనించారు.

ట్వీట్..

అటు జవాన్లతో కలిసి.. బండిపోరా జిల్లాలోని కంట్రోల్ లైన్ వెంబడి ఉన్న మారుమూల ప్రాంతం తులైల్ గ్రామంలోని పాఠశాలను సందర్శించారు అక్షయ్. సరిహద్దులలో ఉన్న జవాన్లను కలవడానికి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా నీరు గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత స్థానికులు, భద్రతా బలగాలతో కలిసి కాసేపు ముచ్చటించి.. అనంతరం ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడి పాఠశాల భవనానికి కోటి రూపాయాలను విరాళంగా ప్రకటించారు.

ట్వీట్..

Also Read: Hansika: వివాదంలో హాన్సిక సినిమా.. ‘మహా’ మూవీ రిలీజ్ ఆపాలని పిటిషన్.. దర్శకుడికి షాకిచ్చిన హైకోర్టు..