Laal Singh Chaddha: కాకినాడలో సందడి చేస్తున్న ఆమిర్ ఖాన్.. ఫోటోల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్

Laal Singh Chaddha:బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ ఖాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో సందడి చేశాడు. ఆమిర్‌ ఖాన్ తాజా సినిమా లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ తాజాగా కాకినాడకు షిప్ట్ అయ్యింది..

Laal Singh Chaddha: కాకినాడలో సందడి చేస్తున్న ఆమిర్ ఖాన్.. ఫోటోల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్
Laal Singh Chaddha

Updated on: Aug 13, 2021 | 7:18 AM

Laal Singh Chaddha:బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ ఖాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో సందడి చేశాడు. ఆమిర్‌ ఖాన్ తాజా సినిమా లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ తాజాగా కాకినాడకు షిప్ట్ అయ్యింది. కాసరోవర్ హోటల్ లో ఆమిర్ ఖాన్ బస చేశాడు. దీంతో ఆయన్ని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఆమిర్ ఖాన్ తో ఫోటోలను తీసుకోవడం కోసం అభిమానుల ఉత్సాహం చూపించారు.

 

ఆమిర్‌ ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తు‍న్న సంగతి తెలిసిందే. ఇందులో చైతూ ఆర్మీ ఆఫీసర్‌ బాలాగా కనిపించగా ఆమిర్‌ ఖాన్.. లాల్‌ సింగ్‌ పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్పటికే చైతన్య తన పాత్ర షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘లాల్‌సింగ్‌ చద్దా’ మూవీ టీం సెట్‌లో కేక్‌ కట్‌ చేసి సందడి చేసిన సంగతి తెల్సిందే. ఇందులో ఆమిర్‌ చైతన్యకు కేక్‌ తీనిపించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే కార్గిల్, లడఖ్, శ్రీనగర్‌ లొకేషన్స్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు చైతన్య. ఈ షెడ్యూల్స్‌లో ఆమిర్, చైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్రదర్శకుడు అద్వైత్‌ చందన్‌. కాగా చైకి హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం.

Also Read:  కిడ్నీలో రాళ్ల నివారణ కోసం ఈ వంటింటి చిట్కాలను పాటించండి ఉపశమనం పొందండి