Shahrukh Khan: షారుఖ్‌ అంటే విదేశీయులకు కూడా ఇంత అభిమానమా.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

|

Jan 04, 2022 | 5:38 PM

Shahrukh Khan: సినిమా హీరోలపై ప్రేక్షకులకు ఉండే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాష, ప్రాంతం లేకుండా హీరోలను అభిమానిస్తుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన...

Shahrukh Khan: షారుఖ్‌ అంటే విదేశీయులకు కూడా ఇంత అభిమానమా.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
Follow us on

Shahrukh Khan: సినిమా హీరోలపై ప్రేక్షకులకు ఉండే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాష, ప్రాంతం లేకుండా హీరోలను అభిమానిస్తుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన అభిమానానికి దేశాలతో కూడా సంబంధం లేదని నిరూపిస్తోంది. బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌కు భారత్‌లో ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం ఇండియన్స్‌ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వారు కూడా షారుఖ్‌కు విపరీతంగా అభిమానిస్తుంటారు. ఇరుగుపోరుగు దేశస్థులే కాకుండా ఏకంగా ఈజిప్ట్‌కు చెందిన వారు కూడా షారుఖ్‌ను ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ అభిమానం కేవలం సినిమాలు చూడడానికే పరిమితం కాకుండా మన దేశంపై నమ్మకాని పెంచే రేంజ్‌లో ఉందంటే నమ్ముతారా.?

వివరాల్లోకి వెళితే.. ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి ట్రావెల్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి భారత్‌కు చెందిన అశ్విని దేశ్‌పాండే అనే మహిళ.. ఈజిప్ట్‌కి వెళ్లేందుకు ఆ ట్రావెల్‌ ఏజెంట్‌ను సంప్రదించింది. దీంతో సదరు వ్యక్తి టికెట్‌ బుక్‌ చేశాడు. అయితే సంబంధిత టికెట్‌ కోసం డబ్బులు పంపించడానికి ప్రయత్నించగా.. సాంకేతిక కారణంతో ఆమె అతనికి డబ్బులు పంపించలేకపోయింది. దీంతో టికెట్‌ను క్యాన్సిల్‌ చేయండని చెప్పింది. అయితే దీనికి స్పందించిన ఆ వ్యక్తి వెంటనే స్పందిస్తూ.. ‘మీరు షారుఖ్ ఖాన్ నివసిస్తున్న దేశం నుంచి వస్తున్నారు. మిమ్మల్ని నమ్ముతున్నాను. నేను మీకు టికెట్స్‌ బుక్‌ చేస్తాను, డబ్బులు తర్వాత ఇవ్వండి. వేరే ఎవరి కోసం ఇది చేయను కానీ.. షారుఖ్‌ ఖాన్‌ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని అంతటినీ అశ్వినీ దేశ్‌పాండే ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. షారుఖ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌కు ఇది ఉదాహరణ అంటూ కొందరు, షారుఖ్‌ స్టామినా ఇది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Talibans: ఇదేం రాక్షస పాలనరా బాబు.. బొమ్మల తలలను నరికేస్తున్న తాలిబన్లు.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Sriharikota Covid: షార్‌లో కరోనా కలకలం..12 మందికి కరోనా నిర్ధారణ.. భయాందోళనలో ఉద్యోగులు..

Watch Video: యూపీలో కాంగ్రెస్ మారథాన్‌లో తొక్కిసలాట.. స్కూల్ అమ్మాయిలకు గాయాలు..