12th Fail: 12th ఫెయిల్ హీరోకు బంపర్ ఆఫర్.. ఆ ఇద్దరు స్టార్ దర్శకులతో సినిమా..

బాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చిన స్టార్ హీరోల సినిమాలను కూడా క్రాస్ చేసింది ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది ఈ సినిమా.. రికార్డ్స్ క్రియేట్  చేసింది 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా ఓ సాధారణ కథను అద్భుత కథనంతో తెరపైకి తెచ్చారు. సినిమా హీరో విక్రాంత్ మాస్సే నటన కూడా చూసిన వారి మనసుకు హత్తుకుంది. ఈ అద్భుతమైన నటుడికి మరో అవకాశం వచ్చింది.

12th Fail: 12th ఫెయిల్ హీరోకు బంపర్ ఆఫర్.. ఆ ఇద్దరు స్టార్ దర్శకులతో సినిమా..
12th Fail

Updated on: Feb 02, 2024 | 11:24 AM

చిన్న సినిమాగా వచ్చిన సంచలన విజయాలు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. బాలీవుడ్ లోనూ ఇటీవలే ఓ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమానే 12th ఫెయిల్. బాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చిన స్టార్ హీరోల సినిమాలను కూడా క్రాస్ చేసింది ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది ఈ సినిమా.. రికార్డ్స్ క్రియేట్  చేసింది 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా ఓ సాధారణ కథను అద్భుత కథనంతో తెరపైకి తెచ్చారు. సినిమా హీరో విక్రాంత్ మాస్సే నటన కూడా చూసిన వారి మనసుకు హత్తుకుంది. ఈ అద్భుతమైన నటుడికి మరో అవకాశం వచ్చింది.

‘మీర్జాపూర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన విక్రాంత్ మాస్సేకి ’12th ఫెయిల్’ సినిమాతో పెద్ద అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విక్రాంత్ మాస్సేకి ఇప్పుడు చాలా పెద్ద అవకాశాలు వస్తున్నాయి. ఇండియాలోనే ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరి సినిమాలో నటించే అవకాశం వచ్చింది.’

రాజ్‌కుమార్ హిరానీ భారతీయ చలనచిత్ర రంగంలో తిరుగులేని దర్శకుడు. స్వయంగా రాజమౌళి కూడా రాజ్‌కుమార్ హిరానీకి వీరాభిమానిని అని చెప్పారు. రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌తో ‘డంకీ’ అనే సినిమా చేశారు హిరానీ. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు హిరానీ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాడు. ఆ చిత్రానికి విక్రాంత్ మెస్సీని కథానాయకుడిగా ఎంపిక చేశారు. హిరానీ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఇదే సినిమాలో విక్రాంత్ మెస్సీ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ సైబర్ క్రైమ్ ఆధారంగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. విక్రాంత్ మాస్సేకి కూడా యష్రాజ్ ఫిలింస్ నుంచి ఆఫర్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

విక్రాంత్ మెస్సి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.