Actress Anushka Sen: ముందుగా బుల్లితెరపై సందడి చేసి.. ఆ తర్వాత వెండితెరపై అలరించిన నటీనటులు చాలా మందే ఉన్నారు. ఇందులో అవికా గోర్, సుశాంత్ సింగ్ వంటి స్టార్స్ అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మరో బుల్లితెర హీరోయిన్.. వెండితెరపై అలరించేందుకు సిద్ధమైవుతుంది.
హిందీలో బ్లాక్ బస్టర్ సీరియల్స్ అయిన బాల్ వీర్, ఝాన్సీ కీ రాణిలలో నటించి మంచి గుర్తింపు పొందింది అనుష్క సేన్. తాజాగా ఈ అమ్మడు హీరోయిన్గా బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఈ బ్యూటీకి ఇన్స్టాలో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిని బట్టి ఈ అమ్మడుకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎంత ఉన్న క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
Also Read:
మరో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న మాస్ మహారాజా.. ఆ స్పెషల్ రోజునే టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ?