మొత్తానికి ప్రేమ పక్షులు పెళ్లి పీటలెక్కబోతున్నారా..!

| Edited By:

Apr 05, 2020 | 2:45 PM

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లికి సిద్ధమయ్యారా..? ఈ ఏడాదిలోనే వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

మొత్తానికి ప్రేమ పక్షులు పెళ్లి పీటలెక్కబోతున్నారా..!
Follow us on

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లికి సిద్ధమయ్యారా..? ఈ ఏడాదిలోనే వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. దీనికి సంబంధించి ఇరు వర్గాల కుటుంబాలు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 21వ తేదీన ఈ ఇద్దరి పెళ్లి చేయాలని వారు అనుకుంటున్నారట. ముంబయిలో ధూమ్‌ ధామ్‌గా రణ్‌బీర్, అలియా పెళ్లి చేయాలని వారు భావిస్తున్నారట. రిషి కపూర్‌ ఆరోగ్యం కూడా ఇటీవల కుదుటపడగా.. వీలైనంత త్వరగా వీరిద్దరి పెళ్లి చేయాలని వారు అభిప్రాయపడుతున్నారట. ఇక అప్పటి పరిస్థితిని బట్టి.. తేదీని మార్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని రణ్‌బీర్ ఇంటికి అలియా వెళ్లగా.. వారిద్దరు ఒకే చోట ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ఈ ఇద్దరు కలిసి వాకింగ్ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరు డేటింగ్‌లో ఉండగా.. గతంలోనూ పలుమార్లు వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లుగా తేలాయి. మరి ఈసారైనా ఈ వార్తల్లో నిజముందో..? లేదో..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: కరోనాపై నిర్లక్ష్యం తగదు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్