Bobby Deol Viral Video: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ డేంజరస్ వైరస్ కారణంగా మానవ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరో ఒకరు మాత్రమే మాస్కులు పెట్టుకొని దర్శనమిచ్చేవారు. కానీ ఈ వైరస్ పుణ్యామాని మాస్కు లేని వారిని భూతద్దంలో వెతికినా కనిపించడం లేదు. అంతేనా.. చేతులను పదే పదే కడుక్కోవడం, శానిటైజర్‌ను ఉపయోగించడం ఇలా ఎన్నో కొత్త అలవాట్లను తప్పనిసరి చేసిందీ వ్యాధి.
ఇదిలా ఉంటే.. సోషల్ డిస్టెన్స్ పాటించడం, ముక్కులో బడ్‌ను పెట్టి ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేయడం, మాస్కు ధరించడం, క్వారంటైన్‌లో ఉండడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇలా కరోనా నియంత్రణ చర్యలన్నింటినీ బాలీవుడ్ హీరో బాబీ డియోల్ 30 ఏళ్ల క్రితమే చెప్పాడనే ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయమేంటంటే.. బాబీ డియోల్ నటించిన కొన్ని సినిమాల్లో పైన తెలిపిన కరోనా నియంత్రణలను పోలిన ఫన్నీ క్లిప్స్ అన్నింటినీ ఓ చోట చేర్చి కొందరు మీమర్స్ వీడియోను క్రియేట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా బాబీ డియోల్ ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేస్తున్నట్లు.. నటి ఐశ్యర్య రాయి ముక్కులో బడ్ పెట్టడం, క్వారంటైన్‌కు సూచికగా డోర్ వేసుకొని గదిలో ఉండడం లాంటి వీడియోలు నవ్వులు పూయిస్తున్నాయి. ‘ది ఇండియన్ మీమ్స్’ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Nithiin BirthDay: ఫ్యామిలీతో నితిన్ బర్త్ డే వేడుకలు.. సందడి చేసిన సింగర్ సునీత దంపతులు..