AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జున సరసన నటించనున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న నాగ్ సినిమా..

కింగ్ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ‘బంగార్రాజు’ గా నాగ్ అందరిని ఆకట్టుకున్నారు.

నాగార్జున సరసన నటించనున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న నాగ్ సినిమా..
Rajitha Chanti
|

Updated on: Feb 12, 2021 | 12:46 PM

Share

కింగ్ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ‘బంగార్రాజు’ గా నాగ్ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఇదే పాత్ర ఆదారంగా మరో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్, నాగార్జున భావించారు. ఈ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ అనేక కారణాలవల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇదిగో స్టార్ట్ అవుతుంది అదిగో మొదలవుతుంది అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల నాగార్జున పూర్తి చేసిన ‘వైల్డ్ డాగ్’ సినిమా నుంచి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా నాగార్జున సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‏డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉండగా.. గరుడ వేగతో హీరో రాజశేఖర్‏కు సూపర్ హిట్ ఇచ్చిన ప్రవీణ్ సత్తారు.. నాగార్జున కోసం ఓ స్టోరీ రెడీ చేసినట్లుగా సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్ కథను నాగార్జున వివరించగా.. నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తర్వలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్ అనే కొత్త బ్యూటీ నాగార్జున సరసన నటించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కీలక పాత్రలో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ నటించబోతున్నారని సమాచారం. ఇదే గనుక నిజమైతే గుల్ పనాగ్‏కు ఈ సినిమా తొలి సినిమా కానుంది. ఈ చిత్రాన్ని శరత్ మరార్‏తో కలిసి ఏషియన్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

Also Read:

‘మహా సముద్రం’ నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్ రిలీజ్.. ఊర మాస్ లుక్‏లో జగ్గుభాయ్ అదుర్స్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్