ఇంకోసారి అలా రాస్తే: మీడియా సంస్థకి బాలీవుడ్ నటి వార్నింగ్

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెల ఓ హిందీ వార్తా పత్రిక పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. ఊర్వశికి మాజీ ప్రియుడు అంటూ ఓ హిందీ మీడియా సంస్థ వార్తను రాసింది. ఊర్వశి తన మాజీ ప్రియుడు హర్దిక్‌ పాండ్య సాయం కోరారా? అని వార్త ప్రచురించింది. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో ఊర్వశి దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఆ మీడియా సంస్థ పై మండిపడ్డారు. మీడియా ఛానెళ్లను ఇలాంటి పిచ్చి […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:14 am, Tue, 30 July 19
ఇంకోసారి అలా రాస్తే: మీడియా సంస్థకి బాలీవుడ్ నటి వార్నింగ్

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెల ఓ హిందీ వార్తా పత్రిక పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. ఊర్వశికి మాజీ ప్రియుడు అంటూ ఓ హిందీ మీడియా సంస్థ వార్తను రాసింది. ఊర్వశి తన మాజీ ప్రియుడు హర్దిక్‌ పాండ్య సాయం కోరారా? అని వార్త ప్రచురించింది. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో ఊర్వశి దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఆ మీడియా సంస్థ పై మండిపడ్డారు. మీడియా ఛానెళ్లను ఇలాంటి పిచ్చి వార్తలను ప్రచురించొద్దని వేడుకుంటున్నాను. వీటి వల్ల కుటుంబ కలహాలు వస్తాయి. రేపు ఏదన్నా జరిగితే నా కుటుంబానికి నేను జవాబు చెప్పుకోలేను అని పేర్కొన్నారు. గతంలో పలు పార్టీలకు పాండ్య, ఊర్వశి కలిసే వెళ్లేవారు. దాంతో వారు డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు వచ్చాయి.