మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరైంది. వ్యాపారవేత్త సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నేడు ఈడీ ముందు హాజరుకావాలని ఆమెకు సోమవారమే సమన్లు జారీ చేసింది ఈడీ. దీంతో జాక్వెలిన్ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులు ఆమెను విచారించారు. సుకేశ్ చంద్రశేఖర్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశారు. అనంతరం జాక్వెలిన్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కాగా ఆమెను ఇదివరకే రెండుసార్లు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ అధికారులు.. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తోన్న సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య, నటి లీనా మరియా పాల్‌తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. కాగా చంద్రశేఖర్.. జాక్వెలిన్‌కు విలువైన బహుమతులు ఇచ్చినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు. కాగా ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగేందుకు జాక్వెలిన్‌పై లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాగా మరోవైపు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆదివారం దుబాయికి బయల్దేరగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెపై ఈడీ లుక్‌అవుట్ నోటీసులు ఉండడంతో విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు జాక్వెలిన్‌ను నిలిపివేశారు.
Actor Jacqueline Fernandez appears before Enforcement Directorate (ED) at its office in Delhi in connection with Rs 200 crore extortion case involving conman Sukesh Chandrasekhar pic.twitter.com/LNd6v5qs2y
— ANI (@ANI) December 8, 2021
Shriya Saran: పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది.. బాధ్యతలు పెరుగుతాయి : శ్రియ
GAMANAM Pre Release Event: ఘనంగా గమనం ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ ఎవరంటే..