ఎన్టీఆర్‌ విలన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు..!

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)లో నటిస్తోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తరువాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు.

ఎన్టీఆర్‌ విలన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు..!

Edited By:

Updated on: Apr 14, 2020 | 3:26 PM

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)లో నటిస్తోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తరువాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా.. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్‌ దత్‌ను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట.

పొలిటికల్‌ ధ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో విలన్‌ పొలిటికల్‌ లీడర్‌గా కనిపించబోతున్నారట. ఇక ఆ పాత్ర కోసం సంజయ్‌ సరిగ్గా సరిపోతారని భావించిన త్రివిక్రమ్‌.. ఆయనను సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు ఆయన ఒప్పుకుంటే.. ఈ మూవీకి సంజయ్‌ అదనపు ఆకర్షణ అవ్వనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా పూజా, జాన్వీ కపూర్‌లను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. కాగా త్రివిక్రమ్‌, ఎన్టీఆర్ కాంబోలో ఇది వరకు తెరకెక్కిన అరవింద సమేత మంచి విజయం సాధించడంతో.. ఇప్పుడు రాబోతోన్న రెండో మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: కరోనా టైమ్‌.. విదేశాల్లో తనయుడు.. బెంగలో స్టార్ హీరో..!