AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజకుమారి డయానా కామన్ మ్యాన్ కేటగరిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 కు ఎంపికైంది. ఈ కాంటెస్ట్ లో కూడా తనదైన శైలిలో టాస్కులు ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకుమారి ఆట తీరును చూసి బిగ్ బాస్ లో ఈమెకు స్థానం దక్కుతుందని భావించారు. కానీ అలా జరగలేదు.

Bigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 08, 2026 | 10:37 PM

Share

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో బాగా ఫేమస్ అయ్యిందిరాజకుమారి దయాన. అంతకు ముందు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా నెట్టింట బాగా పాపులర్ అయ్యారామె. ఈ క్రేజ్ తోనే కామన్ మ్యాన్ క్యాటగిరిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కు ఎంపికైంది. ఈ కాంటెస్ట్ లో భాగంగా తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఫిజకల్ టాస్కుల్లో రాజకుమారి ఆడిన తీరును చూసి ఆడియెన్స్ తో పాటు జడ్జీలు కూడా ఫిదా అయిపోయారు. ఇదే క్రమంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్ని ఇబ్బందులు, వాటిని అధిగమించిన తీరును పంచుకుని తనలాంటి మహిళలకు స్ఫూర్తినచ్చారామె. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్ట్ లో ఆమె ఆట తీరును చూసి బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్స్ జాబితాలో రాజకుమారి పేరు కచ్చితంగా ఉంటుందని చాలా మంది భావించారు. కానీ అదేమీ జరగలేదు. ఊహించని విధంగా రాజకుమారి దయాన బిగ్ బాస్ అవకాశం కోల్పోయింది. అయితే ఇప్పటికే ఎన్నో తిరస్కరణలను చూసిన రాజకుమారి దీనిని కూడా లైట్ గానే తీసుకుంది. అయితే ఇదే క్రమంలో కొందరు అదే పనిగా రాజకుమారిని ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఛాన్స్ కోసమే ఆమె తన వ్యక్తిగత విషయాలను చెబుతోందంటూ రాజకుమారికి ‘సింపతీ స్టార్’ అని ట్యాగ్ తగిలించి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడిదే ట్రోల్స్ విషయంపై ఎమోషనల్ అయ్యింది రాజకుమారి. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.

‘ఒక బిడ్డగా ఓడిపోయాను.. ఒక పెళ్లాంగా విసిగిపోయాను.. ఒక తల్లిగా మాత్రం ఓడిపోవద్దని పోరాటం చేస్తున్నాను’ అంటూ తన పిల్లలు నిద్రపోతూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు రాజకుమారి. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ‘ హలో అండి నేను సింపతీ స్టార్ రాజకుమారి డయానా. హైదరాబాద్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి చాలా బాధేసింది.సింపతీ స్టార్ను… సింపతీ స్టార్ను…” అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు. నేను ఏం తప్పు చేశాను నాకే అర్థం కావట్లేదు అండి… నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు అన్నీ వింటుంటే… ఒక మనిషిగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా… నేను కూడా ఒక మనిషినే అండి. నాకూ బాధ ఉంటుంది… నాకూ కన్నీళ్లు వస్తాయి.అలాగనీ నేను ఎవరినీ నిందించడం లేదు. ఒక్కసారి నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు రాజకుమారికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఆమెకు బిగ్ బాస్ హౌస్ లో స్థానం కల్పించాల్సింది అంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రాజకుమారి దయానా షేర్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us