Bigg Boss Non-Stop: బిగ్ బాస్ షోపై CPI నారాయణ సంచలన కామెంట్స్.. వ్యభిచార గృహమంటూ..

బిగ్ బాస్ నాన్ స్టాప్(Bigg Boss Nonstop) గ్రాండ్ లాంఛ్‌కి సర్వం సిద్ధమయ్యింది. డిస్లీ హాట్ స్టార్‌లో ఇవాళ్టి నుంచి ఈ షో ప్రసారం కానుంది. గ్రాండ్ లాంఛ్ కార్యక్రమం ప్రసారాలు శనివారం సాయంత్రం 6 గం.ల నుంచి ప్రారంభంకానుంది.

Bigg Boss Non-Stop: బిగ్ బాస్ షోపై CPI నారాయణ సంచలన కామెంట్స్.. వ్యభిచార గృహమంటూ..
Bigg Boss Non-Stop

Updated on: Feb 26, 2022 | 3:30 PM

బిగ్ బాస్ నాన్- స్టాప్(Bigg Boss Non-stop) గ్రాండ్ లాంఛ్‌కి సర్వం సిద్ధమయ్యింది. డిస్లీ హాట్ స్టార్‌లో ఇవాళ్టి నుంచి ఈ షో ప్రసారం కానుంది. గ్రాండ్ లాంఛ్ కార్యక్రమం ప్రసారాలు శనివారం సాయంత్రం 6 గం.ల నుంచి ప్రారంభంకానుంది. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. కాగా బిగ్ బాస్ షోపై సీపీఐ నేత నారాయణ(CPI Narayana) మరోసారి ఫైర్ అయ్యారు. ఏకంగా బిగ్ బాస్ షో వ్యభిచార గృహమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ నారాయణ గతంలోనూ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లోపల జరుగుతున్నదంటూ చీకటి వ్యవహారమంటూ ఆయన మండిపడుతున్నారు.

టీవీ స్క్రీన్‌పై సెన్సేషన్‌గా మారిన బిగ్‌బాస్‌ షో… పెద్దల నుంచి పిల్లల వరకు జనం వెర్రిగా చూస్తున్నారు. అయితే బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలంటూ సీపీఐ నారాయణ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకూ పనికిరాని ఈ షో వల్ల… సమాజం నాశనమైపోతుందన్నది ఆయన వాదన. అందుకే, బిగ్ బాస్ ప్రసారాలను వెంటనే ఆపేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. దీని కోసం ఇప్పుడొక స్పెషల్‌ క్యాంపెయిన్‌ కూడా ప్రారంభించారు. స్టాప్‌ బిగ్‌బాస్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ప్రచారం చేయబోతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట మహిళల్ని అవమానించొద్దన్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి… ఇలాంటి షోలు చేయొద్దని సూచిస్తున్నారు. యాంటి బిగ్‌బాస్‌ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానంటున్నారు.

బిగ్‌బాస్‌.. బిగ్‌ న్యూసెన్స్‌ అంటున్నారు నారాయణ. అప్పుడూ.. ఇప్పుడు… బిగ్‌బాస్‌పై ఎప్పుడూ తనది ఒకటే అభిప్రాయం అంటున్నారు. గతంలో కాస్త కూల్‌గానే బిగ్‌బాస్‌ షోపై విమర్శలు చేసిన నారాయణ.. ఈసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏకంగా.. బిగ్‌బాస్‌ హౌజ్‌ను బ్రోతల్‌ హౌజ్‌తో పోల్చేశారు. లైసెన్స్‌డ్‌ బ్రోతల్‌ హౌజ్‌ అంటూ.. విరుచుకుపడ్డారు. అంతేకాదు… ఇది రెడ్‌లైట్‌ ఏరియా కన్నా దారుణమైందంటూ విరుచుకుపడ్డారు.

బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ కామెంట్స్..

ఎవరికి లాభం.. ఎవరికి ఉపయోగం… ఈ బిగ్‌బాస్‌ షో వల్ల ఎవరికైనా ఈసమెత్తు ప్రయోజనం చేకూరుతోందా? పిల్లలకు నాలెడ్జ్‌ ఏమైనా వస్తోందా? అని నారాయణ ప్రశ్నించారు. ఇప్పుడే కాదు, గతంలోనూ బిగ్‌బాస్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ. దీనిపై ఆయన కోర్టులనూ ఆశ్రయించారు.

Also Read..

Bigg Boss Nonstop: మంచోళ్ళకు మంచితనం.. చెడ్డోళ్లకు చెడుగుడు.. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్ నాన్ స్టాప్..

Helicopter Crash: హెలికాఫ్టర్ల ప్రమాదానికి కారణాలు.. ఇప్పటి వరకూ దేశంలో మరణించిన ప్రముఖుల వివరాలు..