రాంధవ కథానాయకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ భువన్ పొన్నన్న హీరోగా ఓ రొమాంటింగ్ మూవీ తెరకెక్కుతుంది. 1970లో విజయాన్ని సాధించిన రొమాంటిక్ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘ప్రణయ రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి టీ. సుదర్శన్ చక్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో 21 మంది హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రస్తుతానికి 18 మంది హీరోయిన్లు ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట. కర్ణటక, ముంబాయి, బెంగాల్ మరియు ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన నాయికలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
కొల్లూరు ముకాంభికా మరియు లైక ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రణయ రాజా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వికాస్ రాజా వశిస్ట సంగీతాన్ని అందిస్తుండగా.. రాజా శివ శంకర్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు. ఈ చిత్రాన్నికి సంబంధించిన స్టంట్స్‌ను అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే జనవరిలో ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది.