Bigg Boss 5 Telugu: చిరంజీవి సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. ఎవరో తెలుసా.?

|

Dec 23, 2021 | 7:25 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే మరోవైపు అందులో పాల్గొన్న కంటెస్టెంట్‌ల జీవితాలను మార్చేస్తోంది. హౌస్‌లో ఉన్నన్ని రోజులు రెమ్యునరేషన్‌ అందించడమే కాకుండా..

Bigg Boss 5 Telugu: చిరంజీవి సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. ఎవరో తెలుసా.?
Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే మరోవైపు అందులో పాల్గొన్న కంటెస్టెంట్‌ల జీవితాలను మార్చేస్తోంది. హౌస్‌లో ఉన్నన్ని రోజులు రెమ్యునరేషన్‌ అందించడమే కాకుండా బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫేమ్‌ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు గడిచిన అన్ని సీజన్‌లలో పాల్గొన్న వారు సినిమా ఆఫర్లతో పాటు సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకున్నారు. అంతకు ముందు వెండి తెరపై కనిపించని వారు కూడా సినిమా చాన్స్‌లను కొట్టేశారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌ కూడా సినిమా ఆఫర్‌ను సొంతం చేసుకుంది.

ఆ కంటెస్టెంట్‌ మరెవరో కాదు కొరియోగ్రాఫర్‌ యానీ మాస్టర్‌. 11వ వారంలోనే ఎలిమినేట్‌ అయిన యానీ మాస్టర్‌ ఉన్నన్ని రోజులు మాత్రం తనమార్క్‌ ఉండేలా చూసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యానీ మాస్టర్‌ సినిమా ఆఫర్‌ను కొట్టేసినట్లు స్వయంగా తెలిపారు. ఈ విషయమై ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న భోళా శంకర్‌ చిత్రంలో యానీ మాస్టర్‌ నటించనున్నట్లు తెలిపారు. నిజానికి బిగ్‌బాస్‌హౌస్‌లోకి వెళ్లడానికి ముందే యానీ మాస్టర్‌ ఈ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో చిరంజీవి, వెన్నెల కిషోర్‌ల పక్కనే తాను ఉంటానంటూ హింట్‌ ఇచ్చేశారు యానీ మాస్టర్‌. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను దర్శకుడు మెహర్‌ రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యానీ మాస్టర్‌ కేవలం నటనకే పరిమితం కాకుండా.. కొరియోగ్రాఫర్‌గా కూడా వ్యవహరించనున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా యానీ మాస్టర్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Also Read: RRR Movie: అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్‌ అరాచకం షురూ.. విడుదలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే..

AHA OTT: ఆహా కోసం బరిలోకి దిగనున్న సుకుమార్‌.? భారీ స్కెచ్‌ వేస్తోన్న తొలి తెలుగు ఓటీటీ..

AHA OTT: ఆహా కోసం బరిలోకి దిగనున్న సుకుమార్‌.? భారీ స్కెచ్‌ వేస్తోన్న తొలి తెలుగు ఓటీటీ..