బిగ్బాస్ కంటెస్టెంట్ నటి పవిత్ర పూనియా తండ్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న పవిత్ర షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఢిల్లీకి వెళ్ళారు. పవిత్ర పూనియా తండ్రి ఒక్కసారిగా కిందపడిపోయారట. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పవిత్రకు చెప్పడంతో వెంటనే షూటింగ్ సెట్స్ నుంచి వెళ్ళిపోయారు.
ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు పవిత్ర. ఈ క్రమంలో తన తండ్రి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు పవిత్ర. మనం పంచుకున్న నవ్వుల చిరుజల్లులు నేను మిస్ అవుతున్నా నాన్నా.. నువ్వు త్వరగా కోలుకోవాలి, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కాగా కోరుకుంటున్నదాని కంటే ముందుగానే కోలుకొని మళ్ళీ కళ్ళ ముందు హుందాగా తిరగాలి అని ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. 2009లో స్ల్పిట్స్ విల్లా అనే రియాలిటీ షోతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు పవిత్రం. ఇటీవల ప్రారంభమయిన హిందీ బిగ్బాస్ సీజన్ 14లో పాల్గొని ఎలిమినేట్ అయ్యారు.