AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమల్ అంతపని చేశాడా..! నటి సంచలన వ్యాఖ్యలు

లోకనాయకుడు కమల్‌హాసన్‌పై నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్‌ను కమల్, తన తనయకు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన మీరా.. కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ ట్వీట్ చేసింది. ‘కోలీవుడ్‌లో నెపోటిజం పీక్స్‌లో ఉందని నిజమైంది. సినిమా నుంచి నన్ను తప్పించి తన కూతురికి అవకాశం వచ్చేలా చేశారు కమల్ హాసన్. ఇలా చేసినందుకు దర్శకుడు […]

కమల్ అంతపని చేశాడా..! నటి సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 14, 2019 | 11:41 AM

Share

లోకనాయకుడు కమల్‌హాసన్‌పై నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్‌ను కమల్, తన తనయకు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన మీరా.. కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ ట్వీట్ చేసింది. ‘కోలీవుడ్‌లో నెపోటిజం పీక్స్‌లో ఉందని నిజమైంది. సినిమా నుంచి నన్ను తప్పించి తన కూతురికి అవకాశం వచ్చేలా చేశారు కమల్ హాసన్. ఇలా చేసినందుకు దర్శకుడు నవీన్‌కు, అక్షరా హాసన్‌కు, నిర్మాత శివకు సిగ్గుగా అనిపించడంలేదా? వారికి డబుల్ స్టాండర్డ్స్ బుద్ధి ఉందని బాగా తెలుస్తోంది’ అని మీరా ట్వీట్ చేసింది.

మరోవైపు మీరా చేస్తున్న ఆరోపణలపై దర్శకుడు నవీన్ స్పందించారు. ‘అగ్ని సిరాగుగల్ సినిమాలో మొదట షాలినీ పాండేను అనుకున్నాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో అక్షర హాసన్‌ను ఎంపిక చేసుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాలో అక్షర హాసనే కథానాయిక. అసలు ఈ మూవీ కోసం మేము మీరా మిథున్‌ను ఎంపిక చేసుకోలేదు. నా అనుమతి లేకుండా సినిమాలో తనను ఎంపిక చేసుకున్నామని ఆరోపిస్తోంది. మొదట నేను ఆమె మాటలు పట్టించుకోకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్న రాద్దాంతం వల్ల స్పందించాల్సి వస్తోంది’ అని నవీన్ తెలిపారు.

అయితే వివాదాలు మీరాకు కొత్తేం కాదు. గతంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ‘నమ్మ వీట్టు పిళ్లాయ్’ అనే సినిమాలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తొలగించారని ఆమె ఆరోపించారు. అంతేకాదు బిగ్‌బాస్ 3 షోలో పాల్గొన్న సమయంలో తమిళ దర్శకుడు చరణ్‌ తనను ఎక్కడపడితే అక్కడ ముట్టుకున్నాడని ఆరోపించారు. ఇక బయట కూడా ఆమెపై పలు కేసులు ఉన్నాయి. డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో ఇప్పటికీ ఆమెపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..