హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ సీజన్ 14లో విషాదం చోటు చేసుకుంది. బిగ్‌బాస్‌కు కొన్నేళ్లుగా టాలెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న పిస్తా ధాకడ్ (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బిగ్‌బాస్ సీజన్ 14 వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. పిస్తా ధాకడ్ మృతితో బిగ్‌బాస్ నిర్వాహకుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకెళితే.. పిస్తా ధాకడ్ వీకెండ్ షూటింగ్ పూర్తిచేసుకొని తన అసిస్టెంట్‌తో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. స్కిడ్ అయి కింద పడిపోయారు. కింద పడిపోగానే వాళ్ళకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ.. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వ్యానిటీ వ్యాన్ వాళ్ళ పై నుంచి దూసుకెళ్ళింది. దీంతో పిస్తా ధాకడ్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె అసిస్టెంట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చిన్న వయసులోనే పిస్తా ప్రాణాలు కోల్పోవడంతో అందరిని దిగ్ర్బాంతికి గురయ్యారు. పిస్తా మరణంపై సినీ ప్రముఖులు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అటు పిస్తా మరణంపై సల్మాన్ ఖాన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Such a joyful, vibrant, and a happy soul. You will be missed by everyone who’s life you touched #RIP Pista???
— Shehnaaz Gill (@ishehnaaz_gill) January 16, 2021
Also Read: మరోసారి దాతృత్వం చాటుకున్న షారూక్.. ధన్యావాదాలు చెప్పిన కేరళ ఆరోగ్య మంత్రి