Ganesh bellamkonda: ప్రముఖ నిర్మాత బెల్లం కొండు సురేశ్ రెండో తనయుడు, హీరో బెల్లం కొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లం కొండ గణేశ్ హీరోగా వెండి తెర ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. ‘స్వాతిముత్యం’ అనే క్లాసిక్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గణేశ్‌కు జంటగా వర్ష బొల్లమ్మ నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో కె. కృష్ణ అనే నూతన దర్శకుడు ఎండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, ఫస్ట్‌గ్లింప్స్ చిత్రంపై పాజిటివ్ బజ్‌ను తీసుకొచ్చాయి. లవ్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా తేదీని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 13న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘స్వాతిముత్యం సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నదే ఈ చిత్ర కథాంశం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి’ అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ లల్ ఎంటర్‌టైనర్‌కు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మరి బెల్లం కొండ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తోన్న ఈ మరో యంగ్ హీరో ఏ మేర సక్సెస్ అవుతాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..