Rinky Chakma: క్యాన్సర్ తో బ్యూటీ క్వీన్ కన్నుమూత.. 28 ఏళ్లకే మిస్ ఇండియా త్రిపుర మృతి

|

Mar 01, 2024 | 3:20 PM

క్యాన్సర్ తో చనిపోతున్నవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కామన్ పీపుల్, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే చిన వయసులో చాలామంది పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు.

Rinky Chakma: క్యాన్సర్ తో బ్యూటీ క్వీన్ కన్నుమూత.. 28 ఏళ్లకే మిస్ ఇండియా త్రిపుర మృతి
Miss India Tripura
Follow us on

క్యాన్సర్ తో చనిపోతున్నవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కామన్ పీపుల్, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే చిన వయసులో చాలామంది పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆమె వయసు 28 ఏళ్లు. గత రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఈ మాజీ బ్యూటీ క్వీన్ చివరకు ఆ వ్యాధితో కన్నుమూసింది. రింకీకి ఊపిరితిత్తులు, తలలో క్యాన్సర్ సోకడంతో బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడింది. ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో రింకీని సాకేత్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించారు.

నివేదికల ప్రకారం.. ఆమెను వెంటిలేటర్ పై ఉంచారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రింకీ తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్ ద్వారా విచారాన్ని వ్యక్తం చేసింది. “ఒక అసాధారణ మహిళ, రింకీ నిజంగా శక్తివంతురాలు. అందరి పట్ల దయగల మనిషి అని పేర్కొంది. ఈ పోటీలో మిస్ బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే బిరుదుతో సత్కరించినట్లు తెలిపింది.

2022లో తనకు ప్రాణాంతక ఫైలోడెస్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని జనవరిలో రింకీ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. కీమోథెరపీ చేయించుకున్న ఆమె బ్రెయిన్ సర్జరీ కూడా చేయించుకోవాలని భావించింది. తాను, తన కుటుంబంతో కలిసి ఛాలెంజింగ్ ను ఎదుర్కొంటున్నానని, గత రెండేళ్లు తరచుగా ఆసుపత్రిలో చేరడం చాలా కష్టంగా ఉందని రింకీ తన అభిమానులకు తెలిపింది.

తన కుటుంబ పొదుపు మొత్తాన్ని చికిత్సకు వినియోగిస్తున్నందున విరాళాలు స్వీకరిస్తున్నట్లు రింకీ తెలిపారు. వాటిని రిసీవ్ చేసుకోవడానికి తాను చాలా బలహీనంగా ఉన్నానని, తనకు కాల్ చేయడానికి బదులుగా సందేశం పంపాలని ఆమె తన శ్రేయోభిలాషులను కోరింది. మీ ప్రార్థనల్లో నన్ను స్మరించుకోండి. ప్రతి ఒక్కరికీ ప్రేమను, స్వస్థతను పంచుతోంది’ అని రింకీ రాసుకొచ్చారు. అయితే చినవయసులోనే చనిపోవడం విషాదం నింపింది.