కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ 14 సీజన్లో మరోసారి రచ్చ మొదలైనట్లుగా తెలుస్తోంది. తాజా ప్రోమో ప్రకారం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో కంటెస్టెంట్స్ రెడ్ మరియు యెల్లో రెండు గ్రూపులుగా మారారు. అందులో రూబీనా దిలాక్ మరియు రాహుల్ వైద్య టీం లీడర్లుగా వ్యవహరించారు. ఈ టాస్క్ సమయంలో మరో టీంలీడర్ అయిన అర్షిఖాన్ పని తన అపోజిట్ టీం సభ్యులను వాష్‌రూంకు వెళ్ళనీయకుండా చూసుకోవడం. అయితే ఇదే సమయంలో రూబీనా టీంలో ఉన్న రాఖీ సావంత్ తనను తాను నియంత్రించుకోలేక నిల్చున్న చోటే వాష్‌రూంకు వెళ్లింది. ఇక ఇదే విషయాన్ని తన టీంలీడర్ రూబీనా చెప్పుకోని.. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటూ ప్రదేయపడింది.
దీంతో రూబీనా తన సహటీం మెంబర్ రాఖీకి సహయం చేయడం కోసం ఒక ప్లాన్ రచించింది. రాఖీకి ఇంట్లో కాస్తా పని ఉందని చెప్పి వెళ్ళి.. తన దుస్తులను మార్చుకోవాలంటూ సూచించింది. టాస్క్ మొదటి రోజు రాఖీ తన ఆటతీరుతో అందరిని అలరించింది. అంతేకాకుండా ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఇవ్వాలంటూ బిగ్‌బాస్‌ను ప్రాధేయపడింది. చివరికి తాను అరటిపండు తొక్క కూడా తిన్నానంటూ బిగ్‌బాస్‌కు కంప్లైంట్ చేసింది. బిగ్‌బాస్ ఇచ్చిన ఈ టాస్క్ రేషన్ సరుకులను పొందడం. ముందుగా గార్డెన్ ఏరియాలో ఈ రెండు జట్లను ఉంచారు. అందులో రెడ్ టీం సభ్యులు వాష్ రూం ఉపయోగించాడానికి వీల్లేదని పసులు టీం లీడర్ అర్షి తెలిపింది. తాజా ప్రోమోలో చూపించిన దాని ప్రకారం రాఖీ సావంత్ వాదనకు దిగింది. సోనాలి పోగాట్ తన గుడ్లను రాకుండా చేసిందని.. అలాగే అభినవ్ శుక్లా ఎలిమినేట్ చేయాలని అడిగినట్లుగా తెలిపింది. కానీ అది తనకు ఇష్టం లేదని.. బయటకు వెళ్ళిన తర్వాత అభినవ్‌తో స్నేహాన్ని కొనసాగించాలనుకుంటున్నాని తెలిపింది.