బాలయ్య మజాకా.. అఖండ2 టీజర్ రిలీజ్.. ఈసారి దేశం మొత్తం థియేటర్లో అభిమానుల తాండవమే..

షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్న బాలయ్య త్వరలోనే అఖండ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. జూన్‌ 10న బాలయ్య పుట్టిన రోజు.. ఈ నేప‌థ్యంలోనే మూవీ నుంచి అప్‌డేట్‌ను పంచుకున్నాడు సంగీత ద‌ర్శకుడు థ‌మ‌న్. సింహం శివుడి రూపంలో రాబోతుందంటూ అఖండ టీజ‌ర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే....

బాలయ్య మజాకా.. అఖండ2 టీజర్ రిలీజ్.. ఈసారి దేశం మొత్తం థియేటర్లో అభిమానుల తాండవమే..
Akhanda 2

Updated on: Jun 09, 2025 | 7:24 PM

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య సినిమా అఖండ 2 నుంచి టీజర్‌ విడుదల చేసింది చిత్ర యూనిట్‌. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తీస్తున్నారు. ఈ మూవీ దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య – బోయపాటి కాంబోతో పాటు బ్లాక్‌బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్న బాలయ్య త్వరలోనే అఖండ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

జూన్‌ 10న బాలయ్య పుట్టిన రోజు.. ఈ నేప‌థ్యంలోనే మూవీ నుంచి అప్‌డేట్‌ను పంచుకున్నాడు సంగీత ద‌ర్శకుడు థ‌మ‌న్. సింహం శివుడి రూపంలో రాబోతుందంటూ అఖండ టీజ‌ర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ అఖండ 2 షూటింగ్ జరిగిందని తెలిసింది. దీంతో బాలయ్య అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఈ మూవీలో సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే, అఖండ 2లో బాలయ్య నటన మరింత హైప్ గా చేరుకుందంటుదంటూ అభిమానులు రెట్టింపు ఉత్సహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.