A. R. Rahman: ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్.. నోటీసులు పంపిమరీ
రెహమాన్, అతని భార్య సైరా బాను గురించి వివిధ పుకార్లు సోషల్ మీడియా అలాగే కొన్ని వార్తా మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి, ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ అలాగే అతని కుమార్తె కుటుంబ సభ్యులు తమ బాధాకరమైన నిరసనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
విడాకుల విషయమై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారికి సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ వార్నింగ్ నోటీసు జారీ చేశారు. తన 29 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ఈ నెల19వ తేదీన విడిపోతున్నట్టు సంగీత స్వరకర్త ఎ.ఆర్. రెహమాన్, ఆయన భార్య సైరా బాను ప్రకటించారు. దీంతో అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ వార్త వైరల్ అయిన తర్వాత, రెహమాన్, అతని భార్య సైరా బాను గురించి వివిధ పుకార్లు సోషల్ మీడియా అలాగే కొన్ని వార్తా మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి, ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ అలాగే అతని కుమార్తె కుటుంబ సభ్యులు తమ బాధాకరమైన నిరసనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి : బాబోయ్ బొమ్మరిల్లు నటి ఇలా మారిపోయిందేంటీ..! అస్సలు గుర్తుపట్టలేరు గురూ..!!
ఎ.ఆర్.రెహమాన్ భారతీయ సినిమాలో సంగీత తుఫాను అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అభిమానులచే ఆస్కార్ నాయగన్ అని పిలుచుకునే ఏ.ఆర్.రెహమాన్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో సంగీతం అందించారు. అనూహ్యంగా ఆయన తమ 29 ఏళ్ల వైవాహిక జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులు షాక్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో అనేక రూమర్లు వ్యాపించాయి. రెహమాన్ తనయుడు అమీన్ తన సోషల్ మీడియా పేజీలో దయచేసి పుకార్లు స్ప్రెడ్ చేయవద్దు అంటూ పోస్ట్ పెట్టాడు.
ఇది కూడా చదవండి : ఆమె నవ్వే ఓ నాటు గులాబీ.. కంగనా వెనకున్న అమ్మాయి ఎవరో కనిపెట్టరా.?
ఆ రికార్డింగ్‌లో, అమీన్ మాట్లాడుతూ, మా నాన్నగారు ఒక లెజెండ్ అని, అతను సంగీత పరిశ్రమలో సాధించింది విజయాలే కాదు, సంవత్సరాలుగా ఆయనకు లభించిన గౌరవం, గౌరవం ,ప్రేమ కూడా అని అన్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పుకార్లకు స్వస్తి పలకాలని ఏఆర్ రెహమాన్ నోటీసులు జారీ చేశారు. 3 పేజీల నోటీసులో 8 హెచ్చరిక పాయింట్లు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ తరపు న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : RGV : ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఆర్జీవీ నెంబర్ బ్లాక్ చేసిన హాట్ యాంకర్..
Notice to all slanderers from ARR’s Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x
— A.R.Rahman (@arrahman) November 23, 2024