Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ తాజా హెల్త్‌ బులిటెన్‌ వచ్చేసింది.. వైద్యులు ఏమన్నారంటే.

|

Sep 14, 2021 | 3:17 PM

Sai Dharam Tej: గడిచిన శుక్రవారం (సెప్టెంబర్‌ 10) రోజున మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దుర్గం చెరువు తీగల వంతెన..

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ తాజా హెల్త్‌ బులిటెన్‌ వచ్చేసింది.. వైద్యులు ఏమన్నారంటే.
Follow us on

Sai Dharam Tej: గడిచిన శుక్రవారం (సెప్టెంబర్‌ 10) రోజున మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దుర్గం చెరువు తీగల వంతెన పై నుంచి ఐకియా వైపుగా గచ్చిబౌలి వెళుతోన్న సమయంలో తేజ్‌ ప్రయాణిస్తోన్న స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో ఒక్కసారిగా యంగ్‌ హీరో రోడ్డుపై పడిపోయారు. స్థానికులు హుటాహుటిన స్పందించి ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించడంతో తేజ్‌ ప్రమాదం నుంచి బయట పడ్డారు.

ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. షోల్డర్‌ బోన్‌ సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అపోలో ఆసుపత్రి వర్గాలు తేజ్‌ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు. ఆయన చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.

చికిత్సలో భాగంగా వెంటిలేటర్‌ అవసరాన్ని తగ్గిస్తున్నామని వైద్యులు తెలిపారు. ముఖ్యమైన బయోమెడికల్ పరీక్షలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఇక తేజ్‌ ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల బృందం అబ్జర్వేషన్‌లో ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా ఆరోగ్యంగా వస్తున్నాడన్న వార్త తెలియడంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో ఫైర్ బ్రాండ్.. ఎవరో గుర్తుపట్టండి..

Naresh: హీరో శ్రీకాంత్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నరేష్.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలంటూ..

సీఎం జగన్‌ నుంచి టాలివుడ్‌ పెద్దలకు పిలుపు.. కలవనున్న మెగాస్టార్ చిరంజీవి బృందం