దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. 38 సంవత్సరాలున్న ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. త్వరలో నిశ్శబ్దం అనే చిత్రంతో అనుష్క ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే టీమిండియాకు చెందిన ఓ క్రికెటర్‌ను అనుష్క పెళ్లాడబోతుందట. ఆ క్రికెటర్ కుటుంబం దక్షిణాదికి చెందినది కాగా.. వారు ఇప్పుడు ఉత్తరాదిన సెటిల్ అయినట్లు తెలుస్తోంది. నిశ్శబ్దం మూవీ రిలీజ్ తరువాత వీరిద్దరి వివాహం జరగనుందని.. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది.
అయితే ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెటర్లలో అనుష్క వయసుకు దగ్గరగా ఉన్న వారు ఎవరూ లేరు. దీంతో అసలు ఆ క్రికెటర్ ఎవరు..? తనకంటే చిన్నవాడిని అనుష్క పెళ్లాడబోతుందా..? అన్న వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా అనుష్క వివాహంపై పుకార్లు రావడం మొదటిసారేం కాదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌తో అనుష్క పెళ్లి జరగబోతున్నట్లు పలుమార్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఓ బిజినెస్‌మ్యాన్, ఓ ఫిట్‌నెస్ ట్రైనర్.. ఇలా పలుమార్లు అనుష్క వివాహానికి సంబంధించిన గాసిప్‌లు వినిపించాయి. కాగా గతంలో పలుమార్లు పెళ్లిపై స్పందించిన అనుష్క.. తన వివాహం గురించి ఏ విషయం దాచుకోనని, ఒకవేళ ఆ సందర్భం వస్తే తానే చెబుతానని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు మళ్లీ అనుష్క పెళ్లి గాసిప్‌లు హల్‌చల్ చేస్తుండగా.. వీటిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
కాగా నిశ్శబ్దంలో అనుష్క మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తుండగా.. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపి సుందర్ దర్శకత్వం వహించగా.. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.