Anushka Shetty : సాధువులతో స్వీటీ.. నెట్టింట చక్కర్లు కొడుతున్న అనుష్క రేర్ ఫోటోలు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ముందువరసలో ఉన్నారు అనుష్క. కుర్ర హీరోయిన్లు ఎంతమంది వచ్చిన తన స్థానం మాత్రం పదిలంగా ఉంది.
anushka shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ముందువరసలో ఉన్నారు అనుష్క. కుర్ర హీరోయిన్లు ఎంతమంది వచ్చిన తన స్థానం మాత్రం పదిలంగా ఉంది. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనుష్క. నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ రావడం మొదలుపెట్టి కొంత కాలమవుతోంది. లేడీ ఓరియెంటెడ్ కథల పట్ల మాత్రమే ఆమె ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ‘భాగమతి’ తరువాత ఆమె చేసిన ‘నిశ్శబ్దం’ అంతగా ప్ర్రేక్షకులకు ఎక్కలేదు. అతి త్వరలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. అనుష్క హీరోయిన్ గా ఇప్పటికే ఒక సినిమా ఖరారు అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ సినిమా విషయమై క్లారిటీ రాలేదు.
అయితే సినిమాలతోపాటు అనుష్క సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కువ గా యాక్టివ్ గా ఉండకపోయినా అడపాదడపా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య ఈ ముద్దుగుమ్మ హరిద్వార్ ట్రిప్ కు వెళ్ళింది. అక్కడి సాధువులతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు ఇటీవల ఓ క్రేజీ డైరెక్టర్ అనుష్కను కలిశాడట. ఒక వెబ్ సిరీస్ కోసం కథను వినిపించాడని సమాచారం అందుతోంది. అనుష్క ఆ దర్శకుడికి దాదాపుగా ఒకే చెప్పింది. కానీ ఇప్పట్లో షూటింగ్ కు హాజరు అయ్యేది లేదని చెప్పిందట. వెబ్ సిరీస్ లపై ఆసక్తి ఉన్న అనుష్క త్వరలోనే ఆ విషయమై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :