అనుష్క సాయాన్ని మరవను.. ఇప్పటికీ మొదటి ఫోన్‌ తనకే చేస్తా: తమన్నా

తన కెరీర్ ప్రారంభంలో అనుష్క తనకు చాలా సాయం చేసిందని చెప్పుకొచ్చారు మిల్కీబ్యూటీ తమన్నా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా

అనుష్క సాయాన్ని మరవను.. ఇప్పటికీ మొదటి ఫోన్‌ తనకే చేస్తా: తమన్నా

Edited By:

Updated on: Sep 05, 2020 | 8:41 PM

Tamannaah about Anushka: తన కెరీర్ ప్రారంభంలో అనుష్క తనకు చాలా సాయం చేసిందని చెప్పుకొచ్చారు మిల్కీబ్యూటీ తమన్నా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా, అనుష్క గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ”టాలీవుడ్‌లో కెరీర్‌ని ప్రారంభించిన సమయంలో నాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా లేరు. ఆ సమయంలో నా కాస్టూమ్స్ విషయంలో అనుష్క చాలా సాయం చేసింది. అంతేకాదు ఇప్పటికీ నాకు ఏది అవసరం అయినా మొదటి ఫోన్ తనకే చేస్తా” అని తెలిపారు.

కాగా అనుష్క, తమన్నా ఇద్దరు ఒకే సంవత్సరం టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తరువాత టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. ఇక బాహుబలిలో ఈ ఇద్దరు కలిసి నటించగా.. అప్పటి నుంచి వీరి మధ్య బంధం మరింత పెరిగింది. ఇక అనుష్క కాకుండా శ్రుతీ హాసన్‌తోనూ తమన్నా చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఈ ఇద్దరు ఇంతవరకు ఒక్క సినిమాలో కలిసి నటించనప్పటికీ.. ‌పలు ఇంటర్వ్యూలో ఒకరిపై మరొకరు ప్రేమను చాటుకున్న విషయం తెలిసిందే.

Read More:

షాకింగ్ న్యూస్‌.. పిల్లల నుంచి కరోనా ముప్పు ఎక్కువేనట

పిఠాపురం ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌