Anupama: స్టార్‌ హీరో కొడుకుతో అనుపమ డేటింగ్?.. సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న పోస్ట్..

మలయాళర్ స్టార్‌ బ్యూటీ నటి అనుపమ పరమేశ్వరన్‌, స్టార్‌ హీరో విక్రమ్‌ కుమారుడైన యువ నటుడు ధ్రువ్‌ విక్రమ్‌ ప్రేమలో పడినట్లు నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ జంటకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనుపమ పరమేశ్వరన్, ద్రువ్‌ విక్రమ్‌లు ఓ మ్యాజిక్ పార్టీకి వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే ఓ వ్యక్తి ఈ ఫోటోను షేర్‌ చేస్తూ అనుపమ, ద్రువ్‌ విక్రమ్‌లు డేటింగ్‌లో ఉన్నారా? అనే క్యాప్షన్ రాయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఇ ఫోటోను చూసిన వారందరూ విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

Anupama: స్టార్‌ హీరో కొడుకుతో అనుపమ డేటింగ్?.. సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న పోస్ట్..
Anupama Dating Hero Dhruv

Updated on: Apr 13, 2025 | 12:10 PM

అనుపమ, ధ్రువ్‌ డేటింగ్‌లో ఉన్నారా? అనే క్యాప్షన్‌తో ఉన్న పోస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో అనుపమ లాగా కనిపించే ఒక అమ్మాయి, ధ్రువ్ లాగా కనిపించే వ్యక్తిని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలపై అభిమానులు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కామెంట్స్‌ చేయగా..మరికొందరు ఇది మారి సెల్వరాజ్‌తో వారు చేయబోయే సినిమా కోసం పీఆర్ టీం చేసిన పనిగా అభిప్రాయపడుతున్నారు.

ఈ పోస్ట్ చూడండి..

ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పా రంజిత్ నిర్మిస్తున్న ‘బైసన్’ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ సినిమాలో ధ్రువ్‌ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ నటిస్తుండగా..రజిషా విజయన్, లాల్, అమీర్, పసుపతి, అనురాగ్ అరోరా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారిన ఫోటో ఈ సినిమాకు సంబంధించినదే అయి ఉంటుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఈ పుకార్లపై అటు అనుపమగాని, ద్రువ్‌ కానీ, చిత్రయూనిట్‌గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

ప్రేమమ్‌ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్ ఫస్ట్‌ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హీరో నితిన్‌ సరసన నటించిన అఆ..సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం ఆమె ‘పరదా’ అనే తెలుగు సినిమాతోపాటు పలు మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగు బ్లాక్‌ బాస్టర్‌ సినియా ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా రూపొందిన ‘ఆదిత్య వర్మ’తో ఇండస్ట్రీకి పరిచయమైన ధ్రువ్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మంచి యాక్టింగ్‌తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..