AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలో ఆయన కూడా ఉన్నాడు.. కానీ ఎడిటింగ్‌లో తీసేశాం.. ఆడియన్స్‌కు షాక్ ఇచ్చిన అనిల్

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు.

సినిమాలో ఆయన కూడా ఉన్నాడు.. కానీ ఎడిటింగ్‌లో తీసేశాం.. ఆడియన్స్‌కు షాక్ ఇచ్చిన అనిల్
Anil Ravipudi
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2026 | 11:17 AM

Share

మెగాస్టార్ చిరంజీవి  హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా విదులైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపింది. సుమారు రూ. 400కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ వింటేజ్ లుక్ లో కనిపించి మెప్పించారు. మెగాస్టార్ వింటేజ్ లుక్స్ మాత్రమే కాదు ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో చిత్రయూనిట్ తో పాటు మెగా అభిమానులంతా ఆనందంలో తేలిపోతున్నారు.

రెండే రెండు సినిమాలు.. ఒకటి హిట్ రెండోది డిజాస్టర్..! ఒకోక్క మూవీకి రూ.7కోట్లు అందుకుంటున్న బ్యూటీ

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగిపోయింది.  అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఒక హీరో కోసం కథ రాసేటప్పుడు ఆయనపై పూర్తి ప్రేమ, అభిమానం ఉండాలని, అప్పుడే కథ సహజంగా, అద్భుతంగా వస్తుందని అన్నారు. చిరంజీవి లాంటి స్టార్ హీరో కోసం కథ రాసేటప్పుడు ఈ సూత్రాన్ని పాటించానని ఆయన పేర్కొన్నారు. మన శంకర వరప్రసాద్ సినిమాలో హీరో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. మొదట యాక్షన్ ఎపిసోడ్‌తో కథను ఓపెన్ చేయాలని అనుకోలేదని, బట్టలు ఆరేసుకునే వరప్రసాద్‌ను ఒక ఆంటీతో గొడవపడే సీన్‌తోనే పరిచయం చేయాలని ముందే అనుకున్నా.. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా యాక్షన్ ఓపెనింగ్ అనేది కామన్, దాన్ని బ్రేక్ చేసి ఒక సాధారణ విడాకులు తీసుకున్న భర్త దైనందిన జీవితాన్ని చూపించడం ద్వారా ప్రేక్షకులకు ఆయన పాత్రను పరిచయం చేయాలనుకున్నా.. ఆ తర్వాత నుంచే చిరంజీవి గారి మాస్ యాంగిల్, హీరోయిజం ఎలివేట్ చేశామని అనిల్ తెలిపాడు.

నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడా..! మూగ అమ్మాయి సినిమాల్లోకా అని అవమానించారు

అంతేకాకుండా సినిమాలో VTV గణేష్‌తో చిత్రీకరించిన ఒక ఓ ఎపిసోడ్‌ను సినిమా నుంచి తొలగించినట్లు అనిల్ రావిపూడి తెలిపారు . రాసినప్పుడు, తీసినప్పుడు బాగానే అనిపించినా, ఎడిటింగ్ లో చూసినప్పుడు అది అనవసరంగా అనిపించిందని, కథా ఫ్లో డిస్టర్బ్ చేస్తోందని అనిపించింది. ఈ 6-7 నిమిషాల నిడివి గల సన్నివేశాన్ని తొలగించడం వల్ల సినిమాకు మంచి వేగం వచ్చిందని, చిరంజీవి గారు ఒక్కే అన్నారని అనిల్ తెలిపాడు. అలాగే సినిమా షూటింగ్ అంతా సజావుగా సాగిందని.. ప్రతిరోజు ఓ పండగలా జరిగిందని అనిల్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

సినిమాలో ఆయన కూడా ఉన్నాడు.. కానీ ఎడిటింగ్‌లో తీసేశాం..
సినిమాలో ఆయన కూడా ఉన్నాడు.. కానీ ఎడిటింగ్‌లో తీసేశాం..
నెలకు రూ.లక్ష జీతంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నెలకు రూ.లక్ష జీతంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
హీరోయిన్‌తో చిన్న ఇల్లుపై ప్రశ్న? రిపోర్టర్‌పై డైరెక్టర్ సీరియస్!
హీరోయిన్‌తో చిన్న ఇల్లుపై ప్రశ్న? రిపోర్టర్‌పై డైరెక్టర్ సీరియస్!
దేశ ప్రజల అత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిః ప్రధాని మోదీ
దేశ ప్రజల అత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిః ప్రధాని మోదీ
అల్లు అర్జున్ రికార్డ్‌..! దిష్టి తీసిన చరణ్‌, గుడ్ న్యూస్..
అల్లు అర్జున్ రికార్డ్‌..! దిష్టి తీసిన చరణ్‌, గుడ్ న్యూస్..
సులువుగా 5వ రోజు JEE Main రెండో షిఫ్ట్ పరీక్ష.. 300కి 300మార్కులు
సులువుగా 5వ రోజు JEE Main రెండో షిఫ్ట్ పరీక్ష.. 300కి 300మార్కులు
ప్రదోష వ్రతం.. శివుడితోపాటు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇలా చేయండి
ప్రదోష వ్రతం.. శివుడితోపాటు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇలా చేయండి
అందరూ ఆ హీరో కాళ్లుకు నమస్కరించారు.. కానీ నేను మొక్కలేదు..
అందరూ ఆ హీరో కాళ్లుకు నమస్కరించారు.. కానీ నేను మొక్కలేదు..
ఉద్యోగుల గ్రాట్యుటీ గందరగోళానికి కేంద్రం చెక్
ఉద్యోగుల గ్రాట్యుటీ గందరగోళానికి కేంద్రం చెక్
ఏం లేదనుకుని వెళ్తుండగా బయటపడ్డ ట్విస్ట్..!
ఏం లేదనుకుని వెళ్తుండగా బయటపడ్డ ట్విస్ట్..!