వినోదాన్ని పంచుతూ తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటోన్న తొలి తెలుగు ఓటీటీ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది. వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన సినిమాను అందిస్తోంది. అలీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా ఆహా వేదికగా ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం సినిమా ‘వికృతి’కి ఈ చిత్రాన్ని రీమేక్‌గా తెరకెక్కించారు.
ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఫొటో వెనకాల అసలు కథ ఏంటి.? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్‌ను నెలకొల్పి అలీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అలీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో నరేష్, పవిత్రా లోకేష్‌లు నటిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో డిజిటల్ ఐడియాకు అనుగుణంగా ఈ సినిమా కథాంశాన్ని రూపొందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వల్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి వంటి ఆసక్తికర పాయింట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
Oka photo online lo sanchalanam chesthe. Ela untundi? ? Daani venuka story enti? Watch the official remake of Vikruthi #AndaruBaagundaliOnAHA Premieres Oct 28#Ali pic.twitter.com/R8rA4yO6EZ
— ahavideoin (@ahavideoIN) October 24, 2022
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వైవిధ్యభరిమతైన కథాంశంతో వస్తోన్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది. ఇక ఈ చిత్రాంలో అలీ, నరేశ్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తుండగా మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితరులు ఇతర పాత్రలో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..