సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై యాంకర్ శ్వేతారెడ్డి విరుచుకుపడ్డారు. తనపై ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. నిజానిజాలు తాను చెబుతానంటూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో.. ‘‘శ్వేతారెడ్డి ఏమైందో ఏమో తెలీనప్పుడు సైలెంట్‌గా ఉండండి. బిగ్‌బాస్ షోకు వ్యతిరేకంగా నేను ఎంత పోరాడానో ప్రపంచం మొత్తానికి తెలుసు. మీకు తప్ప. ఆ రోజు మీరు పదండి మా టీవీ దగ్గరకు వెళ్లి ప్రశ్నిద్దాం అంటూ రెండు డైలాగ్‌లు వేసి మాయమయ్యారు. ఇప్పుడు నా గురించి స్టేట్ మెంట్‌లు ఇస్తున్నారు. మీరు వెళ్లిన తరువాత నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టా. నేషనల్ ఉమెన్ కమిషన్‌లో కేసు ఫైల్ చేశా. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గొంతెత్తా. చెన్నైలో యాంటీ బిగ్ బాస్ ర్యాలీ నిర్వహించా. ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు కానీ జనానికి తెలుసు. మీరు అప్‌డేట్ అవ్వకపోతే నేను ఏం చెయ్యాలి..?’’ అని శ్వేతా రెడ్డి ప్రశ్నించారు.
ఆ తరువాత ఏంటండి..? పోలీసులు వద్దకు వెళితే ఏమౌతుందా..? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా..? లా అండ్ పోలీస్ వ్యవస్థను గౌరవించాల్సిన మీరే ఇలాంటి మెసేజ్‌లు ఇస్తున్నారు. మీరే కదా లీగల్‌గా వెళ్లాలి.. బోడి, బొచ్చు అని సలహాలు ఇచ్చారు. అప్పుడే మర్చిపోయారా? స్టార్ మాతో కుమ్మక్కు అయ్యే సరికి అన్నీ మర్చిపోయారా? అంటూ శ్వేతా రెడ్డి ఫైర్ అయ్యారు. అవునవును మీరు ‘బిగ్ బాస్ 1’ కంటెస్టెంట్ కదా… అందుకే స్వరం మారుతోందా? మీరు మాట మార్చి నన్ను అంటారా? అయినా కంటెస్టెంట్స్‌ని అడిగితే ఇలాగే మాట్లాడతారు. షోలో జరిగే గలీజ్‌ను ఎప్పుడు బయటకు చెప్పరు. స్టార్ మాని సపోర్ట్ చేయాలనుకుంటే చేసుకో.. కానీ నా గురించి మాట్లాడటానికి నువు ఎవరవి అంటూ ఏకీపారేసింది శ్వేతా రెడ్డి.
అయినా నేను మీ లైఫ్‌లో దూరి చూస్తున్నామా? కత్తి మహేష్ ఎక్కడికి పోతున్నాడు.? కత్తి మహేష్ ఏం చేస్తున్నాడు.? కత్తి మహేష్ ఎంత మందికి పేటీఎంలు చేస్తున్నాడు..? అని మేం అడుగుతున్నామా? అని శ్వేతా రెడ్డి అన్నారు. మీకు నాలెడ్జ్ లేనప్పుడు.. సగం సగం నాలెడ్జ్‌తో ఎందుకు కామెంట్లు చేస్తున్నారు. కెమెరా కనిపిస్తే చాలు నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు.. ముందు సబ్జెక్ట్ తెలుసుకుని విషయం మాట్లాడండి. సగం నాలెడ్జ్‌తో మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్వేతా రెడ్డి.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘‘బిగ్ బాస్ విషయంలో శ్వేతారెడ్డి ఆరోపణలు చేశారు కదా’’ అని కత్తి మహేష్‌ను యాంకర్ ప్రశ్నించింది. దానికి సమాధానంగా.. ‘‘ఆమెకు నిలకడ లేదు.. అప్పుడొకమాట.. ఇప్పుడొక మాట మాట్లాడతారు. బిగ్‌బాస్‌పై మా టీవీ ఆఫీస్‌కి వెళ్దాం అన్నాను. కానీ ఆ తరువాత శ్వేతారెడ్డి ఏమైందో ఏమో తెలీదు అంటూ వ్యాఖ్యానించారు.