Rashmi Gautam: ఢిల్లీలోని ఆ జూను బ్యాన్ చేయాలంటోన్న బుల్లితెర బ్యూటీ.. కారణమేంటంటే..

|

Jan 30, 2022 | 6:55 AM

అటు బుల్లితెర, ఇటు వెండితెరపై సత్తా చాటుతూ రోజురోజుకు తన ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది రష్మీ గౌతమ్ (Rashmi Gautam). సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది

Rashmi Gautam: ఢిల్లీలోని ఆ జూను బ్యాన్ చేయాలంటోన్న బుల్లితెర బ్యూటీ.. కారణమేంటంటే..
Rashmi Gautam
Follow us on

అటు బుల్లితెర, ఇటు వెండితెరపై సత్తా చాటుతూ రోజురోజుకు తన ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది రష్మీ గౌతమ్ (Rashmi Gautam). సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. కాగా ఈ అమ్మడికి మూగజీవాలంటే (Animal Lover) ఎంతో ప్రేమ. ఎక్కడైనా ఎవ్వరైనా సరే  జంతువులను హింసిస్తున్నారని  తెలిస్తే వెంటనే స్పందిస్తుంటుందీ అందాల తార. ఇక లాక్డౌన్ (Lockdown) లో వీధి కుక్కలు, జంతువుల కోసం తన వంతు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని ఓ జూలో జరిగిన సంఘటనపై రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి జూలో  ఓ భారీ నీటి ఏనుగు ఎన్నో సంవత్సరాలుగా ఉంటోంది. దీన్ని చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.  కాగా ఇటీవల కేజ్‌ నుంచి నీటి ఏనుగు తల బయటకు పెట్టి చూస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాని తలపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా అది సోషల్ మీడియాలో వైరలైంది.

కాగా ఈ ఘటనపై మండిపడిన రష్మీ తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ‘జూలను బ్యాన్ చేయండి..మనం మూడు నెలలు లాక్ డౌన్ లు ఉంటేనే పిచ్చెక్కి పోయింది.   మరి ఈ జంతువులు జీవితాంతం అలా జూలోనే  ఉంటాయి. ఇకపై వాటికి స్వేచ్ఛనిద్దాం. మీరు కూడా మీ పిల్లలను వినోదం కోసం జూకు తీసుకెళ్లకండి. ఆ జూలు, జైల్లో మూగజీవాలు ఎంత నరకాన్ని అనుభవిస్తాయో మీకు తెలియదు. అక్కడ జంతువులను వారు అక్కడ ఎంతలా హింసిస్తున్నారో ఢిల్లీలోని జూ పార్క్ సంఘటన చూస్తే అర్థమవుతోంది. ఈ విషయంపై అరవింద్ కేజ్రీవాల్, మేనకా గాంధీ లను ట్యాగ్ చేసి షేర్ చేయండి’ అని తన ఫ్యాన్స్ ను కోరింది రష్మీ. కాగా ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో ఓ అతిథి పాత్రలో నటిస్తోంది. అదేవిధంగా  బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Also read: Megastar Chiranjeevi: క్వారంటైన్ లో కెమెరాకు పని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. కవిత్వం కూడా అల్లేశారు..

DRDL Recruitment: హైద‌రాబాద్ డీఆర్‌డీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

Gold, Silver Price Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వస్తున్న ధరలు..!