Viral Video: యాంకర్ సుమ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా సరే సుమ హోస్ట్‌గా ఉందంటే చాలు ప్రేక్షకుల్లో జోష్ నిండాల్సిందే. తనదైన చలాకీ తనం, మాటలతో ప్రేక్షకులకు ఆకట్టుకోవడంలో సుమది అందె వేసిన చేయి. ఇక ప్రేక్షకులకు ఆకట్టుకునే మరో యాంకర్ అనసూయ. అందం, ట్యాలెంట్ కలగలిపిన అతికొద్ది మందిలో అనసూయ ఒకరు. చిన్న న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి టాప్ యాంకర్ స్థాయికి ఎదిగారు. సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగిన అనసూయ ఎంతో మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు.
ఇలా వీరిద్దరూ టాలీవుడ్‌లో తమ ట్యాలెంట్‌తో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రోగ్రామ్‌లతో ఎంత బిజీగా ఉన్నా వీరిద్దరూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇద్దరు ట్యాలెంటెట్ యాంకర్లు ఒక చోట చేరి డ్యాన్స్ చేశారు. సుమ, అనసూయ కలిసి ఏదో షూటింగ్ స్పాట్‌లో ఇంగ్లిష్ సాంగ్‌కు స్టెప్పులేశారు.
ఈ వీడియోను సుమ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇలా ఇద్దరు యాంకర్‌లు కలిసి డ్యాన్స్ చేయడంపై పట్ల నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..