Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్‌బచ్చన్‌ భారీగా పెట్టుబడులు.. రూ.40 కోట్లతో..

బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌బచ్చన్‌.. టెంపుల్‌ టౌన్‌ అయోధ్యలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయోధ్యలో వరుసగా భూములు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తూ హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. అయోధ్యలో ఇప్పటికే పలు ఆస్తులు కొనుగోలు చేసిన అమితాబ్‌.. ఇప్పుడు మరో 40 కోట్ల రూపాయల విలువైన 25వేల చదరపు అడుగుల స్థలాన్ని సొంతం చేసుకున్నారు.

Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్‌బచ్చన్‌ భారీగా పెట్టుబడులు.. రూ.40 కోట్లతో..
Amitabh Bachchan

Updated on: May 29, 2025 | 9:37 AM

అయోధ్యలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పలువురు ప్రముఖులు భూములు కొనుగోలు చేస్తూ అయోధ్య నగరాన్ని మరింత ఆకర్షణ మారుతున్నారు. ఈ క్రమంలోనే.. ప్రముఖ బాలీవుడు నటులు అమితాబ్‌బచ్చన్‌ కూడా అయోధ్య రియల్‌ ఎస్టేట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. అయోధ్యలో ఇప్పటికే పలు ఆస్తులు కొనుగోలు చేసిన అమితాబ్‌.. ఇప్పుడు మరో 40 కోట్ల రూపాయల విలువైన 25వేల చదరపు అడుగుల స్థలాన్ని సొంతం చేసుకున్నారు. అందులోనూ.. అత్యంత విలువైన సరయూ నది సమీపంలో ప్రీమియం ల్యాండ్‌గా పేరుగాంచిన ప్రదేశంలో భూమిని కొనుగోలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అయితే.. రామాలయం పునఃప్రారంభానికి ముందే అమితాబ్‌ పేరుపై నాలుగున్నర కోట్లతో 5వేల 300 చదరపు అడుగుల ప్లాట్‌ రిజిస్టర్‌ అయింది. అంతేకాదు.. ఆయన తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ పేరుమీద ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ కింద 54వేల చదరపు అడుగుల మరో ప్లాట్‌ కూడా ఉంది. తన తండ్రి పేరుతో పెద్ద మెమోరియల్‌ ఏర్పాటుకు అమితాబ్‌బచ్చన్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయోధ్యలోనే కాదు.. వెలుపల కూడా భూములు కొనుగోలు చేస్తూ స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారుతున్నారు.

2023లో అమితాబ్‌, ఆయన కుమారుడు అభిషేక్‌బచ్చన్‌తో కలిసి 25కోట్ల విలువైన 10 అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేశారు. అమితాబ్‌ సతీమణి జయాబచ్చన్‌ గతేడాది రాజ్యసభలో ఆస్తుల వివరాలు ప్రకటించడంతో ఆయా ఆస్తుల డిటేయిల్స్‌ బయటపడ్డాయి. మొత్తంగా.. రామమందిరం పునర్నిర్మాణం తర్వాత అయోధ్య హై-ఎండ్‌ రియల్‌ ఎస్టేట్‌కు కేరాఫ్‌గా మారింది. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రధాన దృష్టిని ఆకర్షిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కాసులు కురిపిస్తన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..