లడాఖ్ లోని వాఖా అనే గ్రామంలో బాలీవడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన ‘లాల్ సింగ్ ఛధా ‘మూవీ షూటింగ్ ముగించుకున్నాడు. ఈ సందర్భంగా ఇక్కడి ప్రజలు ఆయనకు ఆయన టీమ్ కి సాదరంగా స్వాగతం పలికారు.. అన్నట్టు కిరణ్ రావు కూడా ఆమిర్ వెంటే ఉన్నారు. సాంప్రదాయ దుస్తులు దరించిన వీరు సరదాగా ఈ గ్రామీణులతో కలిసి జానపద నృత్యం (ఫోక్ డ్యాన్స్) చేశారు. ఇటీవల తమ డైవోర్స్ గురించి ఈ జంట ప్రకటించింది. అయినా తాము ఫ్రెండ్స్ మాదిరే ఉంటామని కూడా స్పష్టం చేసింది. ఏమైనా వీరు ఇలా లడాఖ్ లో గ్రామీణులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ జంట అప్పుడే విడిపోతారేమోనని ఆందోళన చెందిన ఫాన్స్ ఇవి చూసి వావ్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ ఎలా అయినా తాను పర్ఫెక్ట్ అని నిరూపించుకున్నాడని కితాబిచ్చారు.
దేశంలోని ఈ మారుమూల ప్రాంతంలో..భారత చైనా సరిహద్దుల వద్ద గల ఈ ప్రాంతంలో ప్రజలు తమ ఫోక్ డ్యాన్స్ సందర్భంగా ధరించే డ్రెస్సులను కోస్, సల్మా అంటారట.. గొంబా సమ్ షాక్ అనే పాపులర్ డ్యాన్స్ అనే దీన్ని దశాబ్దాలుగా చేస్తుంటారు. ‘త్రీ ఇడియట్స్’ మూవీ స్టార్ అయిన ఆమిర్ తమ గ్రామాన్ని విజిట్ చేసినందుకు స్థానికులంతా సంతోషంతో పొంగిపోయారు. అన్నట్టు ‘ఫారెస్ట్ గంప్ ‘అనే హాలీవుడ్ మూవీకి లాల్ సింగ్ చద్దా హిందీ రీమేక్ .
మరిన్ని ఇక్కడ చూడండి: వర్షాకాలంలో ఇండియాలోని ఈ ప్రాంతాలను సోలోగా ఎంజాయ్ చేయ్యొచ్చు..
Hyderabad City: హైదరాబాద్‌లో కుప్పకూలిన పురాతన భవనం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..