అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. అయితే తన నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు ఈ యంగ్ హీరో. ‘ ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నా జీవితంలో ప్రత్యేకమైంది. నా ప్రొఫెసనల్ కెరీర్‌లోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో నేనే చెబుతాను. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను’ అని శిరీష్ ట్వీట్ చేశాడు. కాగా అల్లువారబ్బాయి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
అలాంటి ఆశయాలు లేవు బ్రో..
ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి ‘ప్రేమ కాదంట’ అనే సినిమాలో నటిస్తున్నాడు శిరీష్. ఈ మూవీ కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా ప్రయత్నించాడు. ఇటీవల దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా శిరీష్ చేసిన ట్వీట్‌కు ఒక నెటిజన్ ‘ఏంటి బ్రో..హాలీవుడ్‌కు వెళ్తున్నావా?’ అని కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన యంగ్ హీరో.. ‘ నాకు అలాంటి ఆశయాలేమీ లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయింది. కథ బాగా నచ్చింది. నా కెరీర్‌లో ఇది మంచి స్క్రిప్ట్ అవుతుందనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు.
11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I’ll share over the coming weeks. I’ve been off social media for a reason 🙂
— Allu Sirish (@AlluSirish) November 11, 2021
Madonna Sebastian: ముద్దమందార సోయగం మడోన్నా సెబాస్టియన్ సొంతం
Bhanu Shree: కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తున్న భాను శ్రీ వయ్యారాలు..
Sreemukhi: అందాల హంసలా మెరిసిన యాంకరమ్మ.. శ్రీముఖి సోయగాలు..