పుష్ప సూపర్‌హిట్. పుష్ప టూ సూపర్‌డూపర్ హిట్. పుష్ప త్రీ కూడా ఉంటుందని ఆ సిన్మా టీం హింట్ ఇచ్చిందిగానీ.. రీల్ లైఫ్‌ని మించిన స్టోరీ రియల్ లైఫ్‌లో గిర్రున తిరిగిపోతోంది. పుష్ప2 బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలుకొడితే.. ఈ పుష్ప త్రీ ఎపిసోడ్ కంట్రీవైడ్ కుదిపేస్తుండటం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఊరుకున్న ఉత్తమం లేదు.. అనిఊరికే అనలేదు పెద్దలు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడా…అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు.. కానీ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు. సో.. ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. పైగా మధ్యంతరబెయిల్‌ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటితో ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడేలా కనిపించడంలేదు. మరోవైపు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానంటూ దిల్‌రాజు తెరపైకి వచ్చారు. త్వరలో సినీ ఇండస్ట్రీ సీఎం ను కలిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ సమస్య ఇండస్ట్రీ సమస్యగా మారిన దశలో..మున్ముందు ఎలాంటి టర్న్‌లు తీసుకోబోతున్నాయి..? ఈకేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..? అంటే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి..
ఎక్కేమెట్టు.. దిగేమెట్టు.. అన్నట్టుగా ఉంది పుష్ప ది సంధ్య ధియేటర్ ఎపిసోడ్. రీల్ సూపర్‌హిట్టే.. కానీ రియలే బంపర్ ప్లాపన్న చందాన నడుస్తోంది ప్రజెంట్ సిట్చువేషన్. రిమాండ్ రిపోర్ట్ చూసినా.. పోలీసుల యాక్షన్ ఆఫ్ ది మూవ్‌మెంట్ గమనించినా…ప్రభుత్వం సీరియస్‌నెస్ విశ్లేషించినా…కేసుకు ఇరుసులు గట్టిగా ఫిక్స్ చేసినట్లు అర్ధమవుతోంది. దీనికి ఎండ్ బజర్ ఇప్పట్లో ఉండదన్నది అర్థమవుతోంది.
సో..నోడౌట్.. చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో సహకరించడమే మేలు..అన్నది అనుభవజ్ఞులమాట. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ చట్టం తనపని తాను చేసుకుపోతోంది. ఇటు బన్నీ కుడా చట్టానికి సహకరిస్తూ..విచారణకు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం విచారణ నోటీసులు అల్లు అర్జున్‌కు అందాయ. మంగళవారం 11గంటలకల్లా విచారణకు హాజరుకావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మార్నింగ్ పదన్నర ప్రాంతంలో కు జూబ్లీహిల్స్‌లోని తననివాసం నుంచి బయలుదేరారు అల్లు అర్జున్.
పోలీస్ స్టేషన్‌కు అల్లుఅర్జున్ వెళ్తుండటంతో, ఆయన ఇంటి వద్ద కుటుంబ సభ్యుల్లో భయాందోళన కనపడింది. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరే ముందు ఆయన భార్య, కూతురు కారు వద్దకు రాగా, వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. బన్నీతోపాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ, వ్యక్తిగత సిబ్బందితో నాలుగు కార్ల కాన్వాయ్‌లో బయలుదేరారు. షార్ప్ పదకొండు 15నిమిషాలకల్లా చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో బన్నీ అండ్ టీమ్ దిగింది. విచారణ సమయంలో బన్నీ ఆయన తరపు లాయర్ అశోక్ మినహా మిగతా ఎవర్నీ అలౌవ్ చేయలేదు. 11.30-11.40 మధ్య టైములో విచారణ ప్రారంభమైంది. దాదాపు మూడున్నర గంటలపాటు విచారణ జరిగింది.
అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి ఒక గదిలో కూర్చోగా.. మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. మూడున్నర గంటల విచారణలో బోలెడు ప్రశ్నలు. కొన్నింటికి సమాధానాలు..మరికొన్నింటికి మౌనమే సమాధానం. టోటల్‌గా రెండు మూడు ప్రశ్నలకు మినహా..పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నల విషయంలో అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడినట్లు మాచారం.
థియేటర్‌కి వస్తున్నట్టు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు..?
రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా?
పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరూ చెప్పలేదా?
రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లోనే ఉన్నపుడు తెలియదా?
ఏసీపీ, సీఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా?
మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది? ఎక్కడి నుంచి వచ్చారు?
అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏంటి?
ప్రెస్‌మీట్‌లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి?
ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది?
850 మీటర్లు ఎందుకు రోడ్‌షో చేశారు?..
ఇలా బన్నీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం..
ముందుగా సంధ్యా థియేటర్ కు ఏ అనుమతి లేకుండా వచ్చారనే ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నారని సమాచారం. అయితే థియేటర్‌కు తాను ఒక సాధారణ ప్రేక్షకునిగానే వెళ్లానని….తన సినిమాను స్వయంగా అభిమానులతో చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశ్యంతోనే వెళ్లినట్లు బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. వీటన్నింటికంటే ముఖ్యంగా బన్నీకి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోల్ని చూపించారు. ఆ వీడియోలపై బన్నీ అభిప్రాయాల్ని తీసుకొని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. వీటిలో బన్నీ ఊరేగింపుకు సంబంధించిన వీడియోలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ కోర్టులో సమర్పిస్తారు. వీడియోను చూపిస్తూ..ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవతికి సీపీఆర్ అందించినవిజువల్స్‌ను, రేవతి చనిపోయిన సమయం, ఆసమయంలో అల్లు అర్జున్ సంథ్య థియేటర్ బాల్కనీలో సినిమా చూస్తున్న టైమును మెన్షన్ చేస్తూ..పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈసందర్భంలో బన్నీ కాస్త ఇబ్బంది పడినట్లు సమాచారం.
అలాగే రిమాండ్‌రిపోర్ట్‌ను కూడా అల్లు అర్జున్‌కు పోలీసులు చూపించారు. రిమాండ్ రిపోర్టులో మొత్తం 18మందిని నిందితులుగా చేర్చారు . నిందితుల లిస్ట్‌లో A18గా పుష్పమూవీ నిర్మాతలను కూడా యాడ్ చేశారు.
తొక్కిసలాటకు A1 నుంచి A15 వరకు ఉన్న నిందితులే కారణమని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా మెన్షన్ చేశారు. వాళ్ల తీరు వల్లే రేవతి చనిపోయిందని పోలీసులు తెలిపారు.
A1 అగమాటి పెద్దరామిరెడ్డి, A2 అగమాటి చిన్నరామిరెడ్డి, A3 ఎం.సందీప్…ఈముగ్గురూ థియేటర్ ఓనర్స్. ఇక ఏ4 నుంచి ఏ10 వరకు థియేటర్‌కు సంబంధించిన సిబ్బంది పేర్లను చేర్చారు. తర్వాత A11 అల్లుఅర్జున్ కాగా.. ఏ12 నుంచి ఏ18 వరకు అల్లు అర్జున్‌కు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది, నిర్మాతల పేర్లను ఉంచారు. ఇందులో అల్లుఅర్జున్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా విచారించనున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ విచారణపై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని..ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామా అన్నారు లక్ష్మణ్.
మరోవైపు అల్లు అర్జున్ విచారణకు చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లిన తర్వాత.. బన్నీ ఇంటి చుట్టూరా తెల్లటి పరదాలు కట్టారు. ఇటీవల ఇంటిపై దాడి జరగడంతోపాటు.. కేసు విచారణ సందర్భంగా మీడియా ఫోకస్ ఎక్కువగా ఉండడంతో.. ఇంట్లో పరిస్థితులు బయటకు కనిపించకుండా గోడలకి ఉన్న ఫెన్సింగ్‌కు పరదాలు చుట్టారు. అయితే చుట్టిన కాసేపటి తర్వాత మళ్లీ వాటిని తొలగించారు.
మొత్తానికి మూడున్నర గంటలపాటు జరిగిన విచారణ కూల్‌గానే సాగింది. మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని.. అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు. మరోవైపు అల్లు అర్జు్న్‌కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారని.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో బెయిల్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి