చెర్రీ ఈవెంట్‌కి బన్నీ, ఎన్టీఆర్ డుమ్మా.. కారణమిదేనా..!

| Edited By: Srinu

Dec 24, 2019 | 3:28 PM

వన్యప్రాణుల సంరక్షణార్థం సతీమణి ఉపాసనతో కలిసి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌‌గా మారిన రామ్ చరణ్.. ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో తన సొంతిట్లో ఓ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించాడు. ఇందులో తాను తీసిన వన్యమృగాల ఫొటోలను సెట్ చేశాడు. ఇక ఈ సందర్భంగా టాలీవుడ్‌ సెలబ్రిటీల కోసం ఓ ఈవెంట్‌ కూడా చేశాడు. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీతో పాటు […]

చెర్రీ ఈవెంట్‌కి బన్నీ, ఎన్టీఆర్ డుమ్మా.. కారణమిదేనా..!
Follow us on

వన్యప్రాణుల సంరక్షణార్థం సతీమణి ఉపాసనతో కలిసి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌‌గా మారిన రామ్ చరణ్.. ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో తన సొంతిట్లో ఓ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించాడు. ఇందులో తాను తీసిన వన్యమృగాల ఫొటోలను సెట్ చేశాడు. ఇక ఈ సందర్భంగా టాలీవుడ్‌ సెలబ్రిటీల కోసం ఓ ఈవెంట్‌ కూడా చేశాడు. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, నాగార్జున, అఖిల్, రానా, సమంత, శ్రుతీ హాసన్ ఇలా పలువురు స్టార్ హీరోహీరోయిన్లు హాజరయ్యారు. అయితే ఈ లిస్ట్‌లో టాలీవుడ్ టాప్ హీరోలైన అల్లు అర్జున్, ఎన్టీఆర్ మిస్ అయ్యారు. వీరిద్దరు ఎందుకు మిస్ అయ్యారన్న దానిపై ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అందునా ఈ ఇద్దరిలో ఒకరు చెర్రీకి ఫ్యామిలీ మెంబర్ కాగా.. మరొకరు బెస్ట్ ఫ్రెండ్. అలాంటిది వారు రాకపోవడం పలు అనుమానాలకు తావును ఇచ్చినట్లైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్‌కు వారు రాకపోవడానికి కారణముందట.

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీపై ఎన్నో అంచనాలను పెట్టుకున్న బన్నీ.. ప్రస్తుతం ఆ పనుల్లో తలమునకలై ఉన్నారట. ఈ క్రమంలో త్రివిక్రమ్, థమన్ రీరికార్డింగ్ పనుల్లో బిజీగా ఉండగా.. బన్నీ ముంబయిలో వీఎఫ్‌ఎక్స్ పనులను చూసుకుంటున్నాడట. అందుకే చెర్రీ చేసిన ఈ ఈవెంట్‌కు బన్నీ రాలేదని తెలుస్తోంది. మరోవైపు యాడ్ షూటింగ్‌లో భాగంగా టెస్ట్‌ షూట్ కోసం ఎన్టీఆర్ వేరే ప్రదేశానికి వెళ్లాడట. దీంతోనే ఎన్టీఆర్ కూడా హాజరుకాలేదని టాక్. ఇదిలా ఉంటే చెర్రీ నిర్వహించిన ఈవెంట్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓ మంచి కార్యక్రమానికి చెర్రీ శ్రీకారం చుట్టాడంటూ వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.